ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గ వైసీపీలో నాలుగు స్తంభాలట నడుస్తోంది. ఆది నుంచి ఇక్కడ వర్గ పోరుకు నెలవైనా అధిష్టానం హెచ్చరించినా కిందిస్థాయి కేడర్, వీటికి నాయకత్వం వహిస్తున్న నాయకులు బేఖాతర్ చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో పార్టీ ఇక్కడ ఓటమి చెందడంతో నిలదొక్కుకోవడానికి మూడేళ్లుగా ముప్పు తిప్పలు పడుతూ ఉంది. జడ్పీ చైర్మన్ నేతృత్వంలో పార్టీ కేడర్, నేతలు ఉమ్మడి కార్యాచరణకు రావాలని, తగ్గట్టుగానే పార్టీ పుంజుకునేలా వ్యవహరించాలని అధిష్టానం ఆదేశించింది.
ఈ సూచనలకు ఓకే అన్న వారంతా ఇప్పుడు దానిని గాలికొదిలేశారు. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వైసీపీలోనే కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా తగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని, కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మరికొందరిని పట్టించుకోవడం లేదని, ఆయన నడవడికపై పార్టీలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆది నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తనను విశ్వసించకుండా వేరొకరికి బాధ్యతలు అప్పగించడాన్ని ప్రశ్నిస్తున్నారు.
అక్కడ ఆరంభమైన కలహం కాస్తా ఈ మధ్య మరింత ముదిరింది. కవురు నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండడం, వేరే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూనే ఉన్నారు. ఎందుకిలా జరుగుతోందని పార్టీ వేదికగా సమీక్షించాల్సిన కవురు ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరో నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాతాజీ సైతం తనంతట తాను రూపొందించుకున్న కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, కరువు చేపట్టే కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. మరో సీనియర్ గుణ్ణం నాగబాబు మాత్రం కవురు వైపే ఉన్నారు.
నియోజకవర్గంలో ఉమ్మడి నాయకత్వం లేకపోగా ఎవరికి వారు వ్యవహరించడం వైసీపీ బలహీనతకు మరో నిదర్శనం. అంతర్గత పోరు, భిన్న వాదనలతో ఆ పార్టీ కకావికలమవుతోంది. దీనిని సర్దుబాటు చేసేందుకు జిల్లా నాయకత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజలతో కలిసి మెలిసి ముందుకు సాగుతుండగా వైసీపీ నేతలు వర్గాల వారీగా విడిపోయి ఎవరికి వారన్నట్టు వ్యవహరిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీనే విజయం దక్కించుకోవడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on August 17, 2022 9:17 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…