Political News

అక్కడ మాత్రం మోడీకి ఇబ్బందులు తప్పవా?

నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయే ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోవటంతో నరేంద్రమోడీకి ఒక్కసారిగా ఇబ్బుందులు మొదలైపోయాయి. లోక్ సభలో బీజేపీ లేదా ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటి ఉన్నా రాజ్యసభలో మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. బిల్లులు గట్టెక్కటానికి ఎన్డీయే పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. జేడీయూ ఉన్నపుడే నూరుశాతం మెజారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు నితీష్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయింది.

245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నది 237 మంది మాత్రమే. ఇపుడున్న ఎంపీల సంఖ్యను తీసుకుంటే బిల్లు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 119. ఇపుడు జేడీయు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్డీయే బలం 110కి పడిపోయింది. అంటే మరో తొమ్మిది మంది ఎంపీల మద్దతుంటే కానీ ఏ బిల్లునూ ఎన్డీయే పాస్ చేయించుకోలేదు. మరపుడు ఏమిచేయాలి ? నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలపైన ఆధారపడక తప్పదు. అంటే బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నమాట.

ఈ నేపధ్యంలోనే  జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత పెరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఇపుడు అవసరానికి ఎన్డీయేకి జగన్ మద్దతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రానికి జగన్ మద్దతిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటంలేదు. ఇపుడు మారిన పరిస్దితుల్లో ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా పట్టుబడితే రాజ్యసభలో మద్దతును దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఏమైనా సానుకూలమయ్యే అవకాశముంది.

ఏదేమైనా ఎన్డీయేలో  లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. రాష్ట్రాలను కూడా బీజేపీ కబళించేస్తోంది. అయినా రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఎన్డీయేకి అందని ద్రాక్ష పండు లాగా తయారవుతోంది. నాలుగు రోజులు మెజారిటి ఉందని అనుకోగానే వెంటనే మైనారిటీలోకి పడిపోతోంది. కాకపోతే మోడీ అదృష్టం ఏమిటంటే యూపీఏ పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉందికాబట్టే  ఏదోలా తటస్థుల మద్దతుతో బిల్లులను ఎన్డీయే గట్టెక్కించగలుగుతోంది. 

This post was last modified on August 11, 2022 2:11 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

22 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

32 minutes ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

1 hour ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

1 hour ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

4 hours ago