ప్రముఖ సినీనటి, మాజీ ఎంఎల్ఏ జయసుధ బీజేపీలో చేరుతున్నారా ? చేరుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని స్వయంగా జయసుధే ప్రకటించారు. ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఈ నెల 21వ తేదీన మునుగోడు బహిరంగ సభలో చేరటంలేదని కూడా క్లారిటి ఇచ్చారు. అంటే మునుగోడు సభలో చేరటం లేదని చెప్పారే కానీ అసలు బీజేపీలోనే చేరటం లేదని మాత్రం చెప్పలేదు.
అయితే పార్టీవర్గాల సమాచారం ప్రకారం తాను బీజేపీలో చేరాలన్నా, ఎన్నికల్లో పోటీచేయాలన్నా తన షరతులకు అంగీకరించాలని స్పష్టంగా చెప్పారట. ఇంతకీ ఆ షరతులు ఏమిటంటే తాను సికింద్రాబాద్ ఎంఎల్ఏగా కానీ లేదా ఎంపీగా కానీ పోటీచేస్తానని మాత్రమే చెప్పారట. అదికూడా తాను పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీచేసినా మొత్తం ఖర్చును పార్టీయే భరించాలన్నారట. మరీ రెండు షరతులకు బీజేపీ అగ్రనేతలు అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది.
అనుమానానికి కారణాలు ఏమిటంటే రెండు కారణాలున్నాయి. మొదటిది సికింద్రాబాద్ లోక్ సభ నుండి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ను కాదని జయసుధకు బీజేపీ టికెట్ కేటాయిస్తుందా అన్నది పెద్ద అనుమానం. అలాగే మొత్తం ఖర్చును పార్టీయే భరించేట్లయితే ఇక జయసుధే ఎందుకు ఇంకా మంచి క్యాండిడేట్ నే చూసుకోవచ్చు. జయసుధేమీ జనాకర్షణ ఉన్న నేత కాదు. అసలు జయసుధ ఒకపుడు ఎంఎల్ఏగా పనిచేసారన్న విషయాన్ని కూడా జనాలకు గుర్తుండదు.
2009 ఎన్నికల్లో జయసుధ గెలిచారంటే అది కేవలం వైఎస్సార్ చలవ వల్లే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా రెండోసారి పోటీ చేసినా జయసుధ ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అక్కడా ఇమడలేక చివరకు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న.
This post was last modified on August 11, 2022 8:27 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…