ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదురొడ్డేంత సాహసం దేశంలోని పవర్ ఫుల్ ముఖ్యమంత్రులకు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక సీఎం ప్రధాని మోడీకి షాకిస్తూ తన పదవికి రాజీనామా చేసి.. తర్వాతి రోజే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే.. బిహార్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (బుధవారం)మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
సినిమాటిక్ ట్విస్టులు ఏమీ లేకుండా తన రాజకీయ జీవితంలో ఎనిమిదో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం విశేషం. తన కొత్త మిత్రుడు ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఆయన తన కేబినెట్ లో కొలువు తీరారు. తాజా కూటమిలో కీలకమైన ఆర్జేడీ పార్టీకి చెందిన కీలక నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత బిహార్ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఆయన సతీమణి.. తేజస్వీ తల్లి.. సోదరుడు తేజ్ ప్రతాప్ లు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారానికి ముందు నీతీశ్ కుమార్ తో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల్ని మాట్లాడుకున్న ఈ ఇద్దరు.. నీతీశ్ నిర్ణయాన్ని బలపర్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆయన్ను అభినందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీలకమైన స్పీకర్ పదవిని ఆర్జేడీకి చెందిన నేతకు అప్పగించేందుకు నీతీశ్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.
మరో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ కు నాలుగు మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం (2015లో) ఇదే కాంబినేషన్లో (జేడీయూ -ఆర్జేడీ- కాంగ్రెస్) బిహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. అప్పట్లోనూ సీఎంగా నీతీశ్.. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా.. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రి పదవులు అప్పజెప్పారు. తాజా ప్రభుత్వంలోనూ అతగాడికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి మోడీషాల ఎత్తులకు భిన్నంగా నీతీశ్ పావులు కదిపి.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు.
This post was last modified on August 10, 2022 4:48 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…