కళ్యాణ్ రామ్ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చిన బింబిసార బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. సీతారామం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోగా ఇటుపక్క బింబిసార మాస్ ని తనవైపు లాక్కుంటోంది. మొత్తానికి రెండు కలిసి ఆడియన్స్ ని పంచుకుని హ్యాపీగా సూపర్ హిట్ స్టాంప్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతున్నాయి. దీని విడుదలకు ముందు నుంచే సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ వచ్చిన నందమూరి హీరో దానికి సంబంధించిన కీలకమైన లీక్స్ ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. అందులో భాగంగానే క్లూ ఇచ్చారు.
రెండో భాగంలో తమ్ముడు దేవదత్తుడుని బింబిసార ఎలా చంపాడన్న నేపధ్యం ఉంటుందట. అంతేకాదు ఇద్దరి మధ్య వైరం ఎలా మొదలయ్యింది, అంత దుర్మార్గుడిగా అన్న ఎలా మారాడు అనే విషయాన్నీ ఇందులో డీటెయిల్డ్ గా చూపించబోతున్నట్టు చెప్పేశాడు. నిజానికి ఇది రాజమౌళి వాడిన ఫార్ములా. అందులో కూడా ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ ని క్రియేట్ చేసి టూ మీద అంచనాలు పెంచేశారు. అది చాలా ఉపయోగపడింది. బింబిసారను ఆ స్థాయితో పోల్చలేం కానీ ఇంటరెస్టింగ్ ట్విస్ట్ అయితే పెట్టారు.
బడ్జెట్ కూడా పెంచబోతున్నట్టు కళ్యాణ్ రామ్ హింట్ ఇచ్చేశాడు. ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే నిర్మాతగా బడ్జెట్ లెక్క చేయకుండా సినిమాలు తీసిన ఇతను ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నాక కాంప్రోమైజ్ ఎందుకు అవుతాడు. దర్శకుడు వశిష్ట నెక్స్ట్ చేయబోయే చిత్రమిదేనా లేక ఇంకో హీరోతో చేశాక ఇది మొదలుపెడతాడా అనే క్లారిటీ ఇంకా రావాలి. పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్ లయితే వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ పూర్తి చేయాల్సి ఉంది. అది అయ్యేలోపు బింబిసార 2కి సంబంధించిన పనులు కొలిక్కి వస్తాయి. ఫ్యాన్స్ ఊహించుకున్నట్టు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశాలు లేనట్టే.
This post was last modified on August 10, 2022 1:10 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…