ఏళ్లకు ఏళ్లుగా.. నెలలకు నెలలుగా సాగుతూ.. ఎప్పటికి జరిగేను అన్న చర్చకు తెర తీసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ ఈ రోజున అనూహ్యంగా సాగింది. 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో విజయంసాధించటం తెలిసిందే. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ మాంచి ఊపులో ఉన్న వేళలోనూ.. రాజగోపాల్ రెడ్డి సాధించిన విజయం చూస్తే.. అతనికి ఉన్న బలం ఏమిటన్నది ఈ ఎన్నికల ఫలితం చెప్పేస్తుంది.
అయితే.. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మీద కినుకుగా ఉన్నారు. అదే సమయంలో ఆయనకు గాలం వేసిన బీజేపీ.. పలు ధఫాలుగా చర్చలు జరిపింది. రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీలో చేరతానన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఎట్టకేలకు తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతికి ఇచ్చారు.
స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన రాజీనామా లేఖను స్పీకర్ చేతికి ఇవ్వటంతో.. ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది? ఎప్పటికి తీసుకుంటారు? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తాయి. వాటికి బదులిచ్చేలా స్పీకర్ పోచారం నిమిషాల వ్యవధిలోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఓకే చేసేశారు. దీంతో.. మనుగోడు ఎమ్మెల్యేగా ఇంతకాలం వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి.. స్పీకర్ పోచారం నిర్ణయంతో ఆయన ఇప్పుడు మాజీ అయిపోయారు.
దీంతో.. ఈ రోజు మొదలు (ఆగస్టు 8) ఆరు నెలల గడువు లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఈ రోజు నుంచి మాజీగా మారిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్పీకర్ చేతికి తన రాజీనామా లేఖను ఇచ్చిన పది నిమిషాల వ్యవధిలోనే పోచారం రాజీనామాకు తన సమ్మతిని తెలియజేస్తూ.. ఆయన నిర్ణయాన్ని ఆమోదించేశారు. ఇక.. రాబోయే మూడు నెలలు ఈ ఉప ఎన్నిక చుట్టూనే తెలంగాణ రాజకీయం నడుస్తుందని చెప్పాలి.
This post was last modified on August 8, 2022 5:15 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…