ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఆమె ఒక జబర్దస్త్. ఎవరిపై నైనా.. ఆమె ఫైర్ చేయాల్సిందే.. కౌంటర్లు వేయాల్సిందే. విషయం ప్లస్సా.. మైనస్సా.. అనే దాంతో ఆమెకు సంబంధం లేనట్టే ఒక్కొక్కసారి వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలానే వ్యవహరించారు. హిందూపురం వైసీపీ ఎంపీ(ఇప్పుడు న్యూడ్ ఎంపీ అని నెటిజన్లు పేరు పెట్టేశారు) గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఆమె రియాక్ట్ అయ్యారు.
అది కూడా ఎక్కడా ఎంపీ నొచ్చుకోని విధంగా.. మంత్రి రోజా స్పందించడం.. ఆసక్తిగా మారింది. నిజానికి ఇప్పటివరకు వైసీపీ ఎంపీ వ్యవహరించిన తీరుపై అదికార పార్టీ నాయకులు పెద్దగా రియాక్ట్ కాని విషయం తెలిసిందే. అయితే.. తొలుత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తర్వాత.. మళ్లీ ఆ రేంజ్‌లో మంత్రి రోజా రియాక్ట్ కావడం.. ఆసక్తిగా మారింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ చేసింది తప్పు కాదనే రీతిలో వెనుకేసుకు రావడం గమనార్హం.
“ఎంపీ గారి వీడియో నిజమో.. కాదో తెలీదు. నిజం ఏంటో తెలియాలంటే.. వెయిట్ చేయాలి. ఆ తర్వాత..సీఎం జగన్ గారునిర్ణయం తీసుకుంటారు“ అని రోజా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇదేసమయంలో ఆమె.. టీడీపీపై విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్ని అకృత్యాలు జరిగినా.. పట్టించుకున్నారా? అంటూ.. ఎదురు దాడి చేశారు. అంతేనా.. నారాయణ స్కూల్‌లో విద్యార్థినులను వేధింపులకు గురి చేసినా.. ఒక్క కేసైనా పెట్టారా? అంటూ.. రోజా నిలదీశారు.
అంటే.. దీనిని బట్టి.. న్యూడ్ ఎంపీ చేసింది కరెక్టేనని చెబుతున్నట్టుగా.. రోజా సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే పనిచేసిన ఎంపీని.. ఇంతలా వెనుకేసుకు రావడం ఏంటో.. అర్దం కావడం లేదని.. వారు నెత్తీనోరూ.. మొత్తుకుంటున్నారు. మహిళల విషయంలో జగన్ ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తారని చెప్పే.. నేతలు.. ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి.. ఇలా సమర్ధింపు వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని నిలదీస్తున్నారు.
This post was last modified on August 7, 2022 10:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…