Political News

చ‌నిపోయినా పింఛ‌ను.. ప‌థ‌కాలు.. ద‌టీజ్ వైసీపీ?

అయ్యా.. మేం క‌ష్టాల్లో ఉన్నాం.. మాకు ఆద‌రువు లేదు.. పింఛ‌ను ఇచ్చి పుణ్యం క‌ట్టుకోండి..అంటూ.. చాలా మంది వృద్ధులు..అర్హులైన పేద‌లు.. స‌ర్కారుకు మొర పెట్టుకుంటున్న విష‌యం త‌ర‌చుగా క‌నిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం మాత్రం చూస్తాం..చేస్తాం..అంటూకాలం గ‌డిపేస్తోంది.

ఇదిలావుంటే.. తాజాగా.. ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఓ చ‌నిపోయిన వ్య‌క్తికి మూడేళ్లుగా ఠంచనుగా పింఛ‌ను ఇస్తున్నారు. అంతేకాదు.. రైతు భ‌రోసా కింద కూడా ఆయ‌నకు నిధులు ఇస్తున్నారు. ఇది ఇన్నాళ్ల‌కు వెలుగు చూసింది. అది ఎక్క‌డో కాదు.. వైసీపీ స‌ర్కారు హ‌యాంలోనే.. అది కూడా కృష్ణాజిల్లాలోనే కావ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ విష‌యం కూడా మంత్రి జోగి ర‌మేష్ నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోనే బ‌య‌ట ప‌డ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజులపాటి సత్యనారాయణ 2013లో మృతి చెందారు. ఆయనకు గత మూడేళ్లుగా వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద రూ. 33,500.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ. 34,500 ఇచ్చినట్లు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి జోగి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి సంబంధించిన ‘సంక్షేమ బావుటా’ పత్రాన్ని అందజేశారు.

దీనికి ఆశ్చర్యపోయిన సత్యనారాయణ కుమారుడు జగదీశ్‌.. మా నాన్న చ‌చ్చిపోయి చాలా ఏళ్లు అయింది.  ఆయ‌న పేరుతో ఎలాంటి ఫించ‌ను కూడా లేదు..  ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై  మంత్రి వెంట‌నే స్థానిక వాలంటీరును ప్రశ్నించగా అదే పేరుతో మరో వ్యక్తి ఇంకో వార్డులో ఉండి ఉంటారని తెలిపినట్లు జగదీశ్‌ పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో ఏవీ నాంచారరావును మంత్రి వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామని తెలిపారు.

అయితే.. దీనిపై స్థానికులు పెద‌వి విరుస్తున్నారు. ఒకే పేరుతొ మ‌రో వ్య‌క్తి ఉండొచ్చ‌ని.. కానీ, ఆయ‌న వ‌య‌సు , ఈయ‌న వ‌య‌సు ఎలా ఒక‌టే అవుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు.. ఆయ‌న వ్య‌వ‌సాయం చేస్తున్నార‌న్న గ్యారెంటీ ఏంట‌ని కూడా వ‌లంటీర్‌ను నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఇది వ‌లంటీర్ మెడ‌కు చుట్టుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 5, 2022 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

8 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

10 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

10 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

11 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

12 hours ago