రాజకీయాల్లో కొన్ని కొన్ని విషయాలు అంతే! అవి శాశ్వతం కూడా! కొందరు నాయకుల అసంతృప్తి కూడా అంతే. అది ఎప్పటికీ నెరవేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాంటిదే.. వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి అంటున్నారు పరిశీలకులు. గత కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత.. రాష్ట్ర విభజనతో.. వైసీపీ నుంచి పిలుపు వచ్చినా.. అటుచూడకుండా.. సైకిల్ ఎక్కారు.
అయితే.. ఆయనకు ఎమ్మెల్సీ అయినా.. దక్కుతుందని.. చంద్రబాబు హయాంలో అనుకుంటే.. తనకు ఎక్కడ ప్రత్యర్థిగా కూర్చుంటాడో.. అని.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అడ్డుపడ్డాడనే వాదన తమ్ముళ్ల మధ్య సాగింది. దీంతో చూసి చూసి.. వేచి వేచి.. వైసీపీలోకి వచ్చారు. లక్కు కలిసి వచ్చింది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. తనకు కనీసం గుర్తింపు లేకుండా పోయిందనేది.. ఆయన ఆవేదన. మంత్రి పదవి ఆశించారు. అది దక్కలేదు.
టీటీడీ బోర్డులో సభ్యత్వం ఆశించారు. అది కూడా చిక్కలేదు. పోనీ.. జిల్లా స్థాయి పదవైనా దక్కుతుందని అనుకున్నారు. అది కూడా లభించలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహం.. నిస్పృహలో ఆయన కూరుకుపోయారు. తీవ్ర అసంతృప్తితో కుమిలిపోతున్నారు. పోనీ.. ఇప్పటికిప్పుడు.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ మారి పోతే.. ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. టీడీపీ అయితే.. ఆయన ను ఆహ్వానించొచ్చు. ఆత్మకూరు టికెట్ కూడా ఇవ్వొచ్చు.
కానీ, మంత్రి పదవి మాత్రం ఇచ్చే సమస్యే లేదు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే.. నెల్లూరు జిల్లాలో అనేక మందికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారందరినీ పక్కన పెట్టి ఆనంకు ఇచ్చే అవకాశం లేదు. పోనీ.. వైసీపీలోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో అయినా.. ఆనంకు ప్రాధాన్యం దక్కుతుందా? అంటే.. అది కూడా సాధ్యమయ్యేలా లేదు. ఎంతో మంది సీనియర్లు పదవుల కోసం.. నెల్లూరులో కాచుకుని కూర్చున్నారు. వీరిని కాదని.. ఆనంకు ఇచ్చే సాహసం.. జగన్ చేయబోరనేది జగమెరిగిన సత్యం. సో.. ఎలా చూసుకున్నా.. ఆనం అసంతృప్తి ఇప్పట్లోచల్లారేది కాదని.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 4, 2022 3:17 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…