Political News

కొరివితో తల గోక్కుంటున్న వైసీపీ

రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మామూలే. ఐతే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసేటపుడు అన్నిసార్లూ గుడ్డిగా ఎదురు దాడి చేయకూడదు. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూడకూడదు. విషాదంతో, ఎమోషన్లతో ముడిపడ్డ  విషయాలను వివాదం చేయాలని చూస్తే బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్నది ఆ కోవలోకే వచ్చేలా ఉంది.

ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణం మీద వివాదం రాజేయాలని చూసి సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, మద్దతుదారులు పెడుతున్న పోస్టులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వారి కుటుంబ సభ్యుల మీదే బలంగా అనుమానాలు వ్యక్తం కావడం, సీబీఐ విచారణలో కూడా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ల పాత్ర మీద బలమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లు #Whokilledbabai అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో బాగా జనాల్లోకి తీసుకెళ్లారు.

ఐతే దానికి బదులుగా అన్నట్లు ఇప్పుడు ఉమామహేశ్వరి మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ #Whokilledpinni అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని వివాదం చేయాలని చూస్తున్నారు వైకాపా మద్దతుదారులు. ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్  అయిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. అతను మాత్రమే కాదు.. ట్విట్టర్లో తన స్థాయికి తగని ట్వీట్లతో నిత్యం నెటిజన్లతో తిట్టించుకునే ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ట్వీట్లు వేశారు. ఐతే ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ, డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని మెజారిటీ జనాలు నమ్ముతున్నారు.

ఇక్కడ ఎవరి నుంచీ అనుమానాలు వ్యక్తం కావడం లేదు. అసలా చర్చే లేదు ఎక్కడా. ఈ మరణంతో వివేకా హత్యను పోల్చడానికి అవకాశమే లేదు. ఎన్టీఆర్ తనయురాలు ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అయ్యో అనుకుంటున్నారు. ఇలాంటి సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం, దీన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేయడం తటస్థంగా ఉండేవారికి కూడా నచ్చట్లేదు. దీని ద్వారా ఏం ప్రయోజనం పొందుదామని అనుకున్నారో కానీ.. అది బూమరాంగ్ అయి వైసీపీకి డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది. 

This post was last modified on August 3, 2022 6:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago