ఏపీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు టీడీపీ పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఈ గడపగడప కార్యక్రమం అత్యంత రభసగా మారుతోంది.
అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓ మహిళకు శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించకపోతే పాపం తగులుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సాయం గురించి ప్రజలకు వివరించారు. ఆ క్రమంలోనే.. ప్రభుత్వం నుంచి చాలా పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు.
అంతేకాదు.. ఈసారి తనను ఆశీర్వదించాలన్నారు. పోనీ.. అంతటితో ఆయన ఆగారా? అంటే.. లేదు. మీరు నాకు ఓటేయకపోతే.. పాపం తగులుతుందని ఓ మహిళకు శాపనార్థాలు పెట్టారు. “ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అప్పులు చేసి మరీ.. మీరు డబ్బులు ఇస్తున్నాం. మీరు ప్రతిపక్షాల మాయలో పడొద్దు. వారు చెప్పే మాటలు వినొద్దు. నమ్మొద్దు. నా మాట వినండి. నేను మీకు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించా. ప్రభుత్వం కూడా సంక్షేమంపేరుతో డబ్బులు ఇస్తోంది. మీ ఓటు నాకే వేయండి“ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఓ మహిళ.. “అదేంటి సార్.. ఇప్పుడే ఓట్లు అడుగుతున్నారు. అప్పుడే ఎన్నికలు రాలేదుగా!` అని ప్రశ్నించే సరికి.. మంత్రి షాక్ కు గురయ్యారు. ఆ వెంటనే తేరుకుని.. “అలా కాదు.. మీరు ఆళ్ల మాటలు.. ఈళ్ల మాటలు విని.. నాకు ఓటేయరేమోనని చెబుతున్నా. మీ ఓటు నాకే.. వేయాలి. వేయపోతే.. మీ యిష్టం.. మీకే పాపం తగులుతుంది“ అని మంత్రి వ్యాఖ్యానించారు.
This post was last modified on August 3, 2022 9:40 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…