నరేంద్ర మోడీకి ఒక చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాన్పూరులో ఒకటో తరగతి చదువుతున్న కృతి దూబే అనే చిన్నారి తన పెన్సిల్ , ఎరేజర్ పోగొట్టుకున్నదట. ఆ విషయం తెలిసిన ఆపిల్ల తల్లి చిన్నారిని గట్టిగా మందలించింది. ఇదివరకు చాలాసార్లు పెన్సిల్, ఎరేజర్ పోగొట్టుకున్నా పట్టించుకోని తల్లి ఇపుడు మాత్రమే ఎందుకింతగా మందిలించిదో దుబేకి అర్ధంకాలేదు. అయితే ఎవరిద్వారానో అసలు విషయం తెలసుకున్న బాలిక ఏకంగా మోడీకే లేఖ రాసేసింది.
మోడీకి లేఖ ఎందుకు రాసిందంటే ఈమధ్యనే కేంద్రప్రభుత్వం అనేక వస్తువులపైన జీఎస్టీ పెంచేసింది. అలా జీఎస్టీ పెంచటం వల్ల ధరలు పెరిగిపోయిన చాలా వస్తువుల్లో పెన్సిల్, ఎరేజర్ లాంటివి కూడా ఉన్నాయి. దాంతో పెన్సిల్, ఎరేజర్ ను పొగొట్టుకుంటే ఇదివరకులాగా కొనటం కష్టమని చిన్నారిని తల్లి మందలించిందట. దాంతో చిన్నారి మోడీకి రాసిన లేఖలో పెన్సిల్, ఎరేజర్ ధరలను ఇంతగా పెంచేస్తే ఎలాగంటు నిలదీసింది.
పెన్సిల్, ఎరేజర్ ను పోగొట్టుకున్నందుకు తన తల్లి కొడుతోందని ఫిర్యాదు చేసింది. అంటే తన తల్లి తనను కొడుతున్నందుకు మీరే కారణమంటు ఏకంగా మోడీని బాలిక నిందించింది. తరగతిలో ఎవరైనా తన పెన్సిల్, ఎరేజర్ ను దొంగలిస్తే తన పరిస్థితి ఏమిటంటు చాలా అమాయకంగా మోడీని సూటిగా నిలదీసింది. తనకు ఎంతో ఇష్టమైన మ్యాగీ ధరలను కూడా పెంచేయటం ఏమిటంటు నిలదీసింది.
నిజంగా చిన్నారి రాసిన లేఖకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే దేశంలోని కోట్లాదిమంది పిల్లల బాధేమిటో కృతి దుబే లేఖలో బయటపడింది. పెన్సిల్, ఎరేజర్ ధరలతో పాటు మ్యాగీ, పన్నీర్ లాంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవటంపై నెటిజన్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో నిలదీశారు. తమదైన సృజనాత్మక రీతుల్లో సోషల్ మీడియాలో మోడీ నిర్ణయాలను ఎండగట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
This post was last modified on August 1, 2022 2:18 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…