ముంబయ్ లో శివసేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం నుండి 9 గంటల పాటు రౌత్లో ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకుని తమ ఆఫీసుకు తీసుకెళ్ళారు. తర్వాత అర్ధరాత్రి రౌత్ ను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. రౌత్ అరెస్టు వెనకాల చాలా పెద్ద వ్యూహమే దాగున్నట్లు సమాచారం. శివసేనకు చీఫ్ ఉద్థవ్ థాక్రే అనేది పేరుకు మాత్రమే.
పార్టీ మొత్తాన్ని నడిపిస్తున్నది సంజయే. సంజయ్ ఏ కారణం వల్లయినా అందుబాటులో ఉండకపోతే థాక్రేకి ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి. థాక్రేకి మించిన కీలకమైన నేత సంజయ్. ఎలాగైనా పార్టీని దెబ్బకొట్టాలన్నది బీజేపీ అగ్రనేతల వ్యూహం. ఇందులో భాగంగానే ముందుగా ఏక్ నాథ్ షిండేకి గాలమేసి దొరికిచ్చుకున్నారు. వాళ్ళనుకున్నట్లే షిండే తిరుగుబాటు లేవదీసి పార్టీని చీల్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు.
తమ మద్దతుదారుడినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని అనుకుని షిండేనే ఏకంగా బీజేపీ సీఎంను చేసేసింది. దాంతో మహారాష్ట్రలో అధికార వ్యవస్ధంతా బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వ పగ్గాలు చేతికొచ్చిన తర్వాత పార్టీపై దృష్టిపెట్టింది. శివసేనను నామరూపాలు లేకుండా చేయాలంటే దాన్ని కూడా నేలమట్టం చేయాలన్న రెండోప్లాన్ మొదలుపెట్టింది. పార్టీపైన థాక్రేకన్నా సంజయ్ కే పట్టెక్కువ. అందుకని ముందుగా రౌత్ సంగతి చూద్దామని అనుకున్నది.
ఇందులో భాగంగానే ఎప్పుడో జరిగిన పాత్రాచాల్ కుంభకోణాన్ని బయటకు తీసింది. ఇందులో రౌత్ కీలకపాత్ర పోసించారన్న ఆరోపణలపై సోదాల తర్వాత అరెస్టు చేయించింది. ఎలాగూ అరెస్టయ్యారు కాబట్టి కొంతకాలం రౌత్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేరు. ఇదే సమయంలో పార్టీ తమకే చెందుతుందని కోర్టు, ఎన్నికల కమీషన్ దగ్గరున్న వివాదాన్ని షిండేకి అనుకూలంగా పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యిందట. అంటే ప్రభుత్వం పోయి, పార్టీ కూడా జారిపోయిన తర్వాత పార్టీలోని నేతల్లో చాలామంది షిండేవర్గంలోకి వెళ్ళే అవకాశాలున్నాయి. సో తన వ్యూహాలను బీజేపీ తెరవెనుక నుండి జాగ్రత్తగా అమలు చేస్తోందని అర్ధమైపోతోంది.
This post was last modified on August 1, 2022 10:52 am
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…