ఏపీలో మద్య నిషేధం అనే విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా మరో మూడేళ్లపాటు బార్లను నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో.. బార్ల యజమానులు పోటెత్తారు. పోటీ పడి మరీ.. పాటపాడుకుంటున్నారు. అదికూడా.. అధిక మొత్తానికే కావడం.. గమనార్హం. దీంతో జిల్లాలకు జిల్లాల్లో రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల మద్యం ఆదాయం సమకూరుతుండ డం గమనార్హం.
రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. శనివారం మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సింగ్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో బిడ్లను అధికారులు తెరిచారు. రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ బార్లకు రీ-బిడ్డింగ్ జరుగుతోంది.
ఎక్కడెక్కడ ఎంతెంత..?
విశాఖ మహానగరంలో 128 బార్లకు దరఖాస్తులకు ఆహ్వనించగా.. 120 బార్లకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులు వచ్చిన వాటిలో 119 బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్శాఖ పచ్చజెండా ఊపింది. విశాఖలో గరిష్ఠంగా రూ.60 లక్షల ధర పలికింది.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 27 బార్లకు లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో ఈ వేలం నిర్వహించగా.. కేవలం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కర్నూలులో 18 బార్లకు 23 మంది అప్లై చేసుకొగా.. ఆదోనిలో 5 బార్లకు ఆరుగురు.. ఎమ్మిగనూరులో 3 బార్లకు ఐదుగురు.. గూడూరులో ఒక్క బారుకు కేవలం ఇద్దరు మాత్రమే అప్లై చేసుకున్నారు. వీరులో లైసెన్స్ కు చెల్లించాల్సిన డబ్బుకు సరిపడా కోడ్ చేసిన వారిని ఎంపిక చేశారు.
తిరుపతిలోని 16 బార్లకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహిస్తున్నారు. బార్ ధరలు అత్యధికంగా రూ.కోటీ 59 లక్షలు పలకగా.. అత్యల్పంగా రూ.కోటీ 49 లక్షలు పలికాయి.
కడపలోని ఓ బార్‌కు కోటీ 71 లక్షలు, ప్రొద్టుటూరులో ఒక బార్‌కు కోటీ 30 లక్షలు రూపాయల బిడ్ దాఖలైంది.
విజయనగరం జిల్లాలో 27 బార్లకు ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 26 బార్లకు లైసెన్స్లు ఖరారు చేశారు. రాజాంలో గరిష్ఠంగా రూ.77 లక్షలు.. నెల్లిమర్లలో కనిష్ఠంగా రూ.17 లక్షలు ధరలు పలికాయి. విజయనగరం జిల్లాలో అన్ని బార్లకు రూ.12.22 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తానికి.. ఇంత ఆదాయం వస్తుంటే.. ఇక మద్య నిషేధం ఎక్కడ అని.. విపక్ష నాయకులు నోరు వెళ్లబెడుతుండడం గమనార్హం.
This post was last modified on July 31, 2022 4:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…