వైసీపీలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కలిసి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, వైసీపీ హవా వంటివి పనిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది ప్రశ్నగా మారింది.
దీంతో ఇప్పుడు డబ్బులు లేనిదే పని జరగదని.. వైసీపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీలు ఇచ్చే దానికన్నా.. తాము ఎక్కువ ఇవ్వాల్సిందేనని.. ముఖ్యంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలను తిరిగి తమ వైపు తిప్పుకొనేందుకు.. ఖచ్చితంగా డబ్బును ఆశ్రయించాల్సిందేనని వారు నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది ఎలా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు.. జగన్ కోసం.. చాలా ఖర్చు చేశారు.
ఆయన చేసిన పాదయాత్రకు కానీ.. ఆయన వస్తే.. తమకు మరింత సౌలభ్యం జరుగుతుందని.. అనుకు న్నారు. కానీ. ఇప్పుడు అన్నీ రివర్స్. ఎవరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాపారులు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఎఫెక్ట్ దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో .. వ్యాపారులు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. పైగా.. జగన్ కన్నా.. టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చారు.
పైకి అంతా బాగుందని.. అనుకున్నా.. వైసీపీ నేతల్లో ఈ చర్చ భారీగానే జరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు… నష్టపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎవరు ఫోన్లు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాట అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 31, 2022 2:03 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…