శవాలు మాట్లాడుతున్నాయ్!!-యండమూరి వీరేంద్రనాథ్ రాసిన.. ఒక నవలలో.. డైలాగు ఇది! ఇప్పుడు ఇదే డైలాగు.. ఏపీలోనూ వినిపిస్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? కరోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధుల విషయంలో గోల్‌మాల్ జరిగిందని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అందుకే.. శవాలు మాట్లాడితే.. తప్ప.. సమస్యకు పరిష్కారం లేదని.. అంటున్నారు. చాలా చిత్రంగా.. అంతకు మించి గోప్యంగా ఉన్న .. ఈ కేసు.. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఏం జరిగింది.?
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కరోనా సమయంలో ఏపీలోనూ చాలా మంది చనిపోయారు. అయితే .. ప్రభుత్వం మాత్రం.. “మేం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా.. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాల సగటుతో పోలిస్తే.. చాలా చాలా తక్కువ” అని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం.. 14,733 మంది మాత్రమే.. కరోనా కారణంగా మృతి చెందారని. రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ఇచ్చింది.
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చింది. దీని నుంచే రాష్ట్రప్రభుత్వం బాధిత కుటుంబాలకు సొమ్ములు సాయం చేసింది. అయితే.. ఇక్కడే “లెక్క తప్పింది” చనిపోయింది.. 14733 మంది అయితే.. పరిహారం మాత్రం 47,228 మంది కుటుంబాలకు అందించినట్టు.. రాష్ట్ర సర్కారు కేంద్రానికి నివేదిక సమర్పించింది. అయితే.. కేంద్రం కూడా ఏపీ సర్కారు చెప్పింది నమ్మేసింది.
ఇలా.. బయటపడింది!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఇది వెల్లడైంది. రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికం. టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.
కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎంత మందికి చెల్లించారు? ఎన్ని తిరస్కరించారు? అని రామ్మోహన్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ ఏడాది మే 27 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 26న రాసిన లేఖ ప్రకారం పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 47,228 క్లెయిమ్స్‌ను ఆమోదించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లించారు. 3,171 దరఖాస్తులను తిరస్కరించారు. అని మంత్రి వెల్లడించారు. మరి.. అధికారికంగా చనిపోయిన వారు.. 14333 అయితే.. మరి మిగిలిన సొమ్ము ఏమైనట్టు.? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే.. శవాలు మాట్లాడాల్సిందేనా?! అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
This post was last modified on July 30, 2022 5:42 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…