Political News

సోముకు షాక్‌… దుమ్ముదులిపేసిన పెద్దాయ‌న‌

క‌ళ్లు మూసుకుని తాగినంత మాత్రాన పిల్లిని ఎవ‌రూ చూడ‌ర‌ని అనుకోవ‌డం త‌ప్పే క‌దా..! అలాగే.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో బీజేపీ నేత‌లు.. ముఖ్యంగా కేంద్రంలోని పెద్ద‌లు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగ‌బోమ‌ని.. చేస్తున్న వ్యాఖ్య‌ల‌ పై సామాన్యులు మండిప‌డుతున్నారు. తాము ఏం చేసినా.. ప్ర‌జ‌లు ఏమీ అన‌రు ధోర‌ణి ఇటీవ‌ల కాలంలో నాయ‌కుల‌కు పెరిగిపోయింది. ఎన్నిక‌లు రాగానే.. ఏమీ తెలియ‌ని అమాయ‌కుల్లా ప్ర‌జల ముందు న‌టించేస్తున్నారు.

అయితే.. ప్ర‌జ‌లు మాత్రం అన్ని విష‌యాల‌ను గుర్తు పెట్టుకుంటున్నారు. కేంద్రం ఏం చేస్తోందో.. రాష్ట్ర పాల‌కులు ఏం చేస్తున్నారో.. రెండు ప్ర‌భుత్వాలు క‌లిసి.. ఏం నాట‌కాలు ఆడుతున్నాయో.. స్ప‌ష్టంగా గ‌మ‌నిస్తున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణే.. తాజాగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఎదురైన ఘాటు సంఘ‌ట‌న‌. శుక్ర‌వారం.. అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉద్య‌మం మ‌రో రూపంలో ప్రారంభ‌మైంది. రాజ‌ధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పాద‌యాత్ర చేయాల‌ని రైతులు నిర్ణ‌యించుకున్నారు.

వారం రోజుల పాటు ఈ పాద‌యాత్ర‌ను చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. రైతుల ప‌క్షానే తాము ఉన్న‌మని చెప్పేందుకు సోము ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా.. రైతుల పాద యాత్ర‌ను ప్రారంభించి.. కొద్ది దూరం ఆయ‌న కూడా న‌డిచారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన వారితో ఆయ‌న బీజేపీ ప్ర‌మోష‌న్‌పై చ‌ర్చించే ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఓ రైతుతో మాట్లా డుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురించి.. రాజ‌ధాని గురించి మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోరాజ‌ధాని ప్రాంతానికి చెందిన ఒక పెద్దాయ‌న‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఆ పెద్దాయ‌న వెంట‌నే రియాక్ట‌యి.. వాడు మీరు తోడు తోడుదొంగ‌లై... రాజ‌ధానిని ఇలా నాశ‌నం చేశారు అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అవాక్క‌యిన సోము వీర్రాజు.. ఐదేళ్లు ఆగ‌వ‌య్యా..నువ్వు అంటూ.. అక్క‌డ నుంచి చిర‌చిర‌లాడుతూ.. కొర‌కొర చూస్తూ.. జారుకున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ వీడియో.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. ఆ పెద్దాయ‌న ఆగ్ర‌హంలోనూ.. అర్ధం ఉంద‌ని అంటున్నారు.. ప‌రిశీల‌కులు. రాజ‌ధానికి శంకు స్థాప‌న చేసిందే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని ఎలా ఉంద‌ని కూడా ఆయ‌న ఆరా తీయ‌లేదు. క‌నీసం.. నిధుల ఊసు కూడా లేదు. పైగా జ‌గ‌న్‌..మూడు రాజ‌ధానులు అని చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. కూడా అదెలా.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఉంది క‌దా! అని అన్న పాపాన పోలేదు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు.. తాజాగా సోముకు షాక్ ఇచ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా.. నాయ‌కులు ప్ర‌జ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారో లేదో చూడాలి.

This post was last modified on July 29, 2022 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

48 minutes ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

3 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

4 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

4 hours ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

5 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

5 hours ago