Political News

మంగ‌ళ‌గిరి యూట‌ర్న్.. ఆళ్ల వల్ల కాదట

వైసీపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేదెవ‌రు.. అస‌లు టికెట్ ద‌క్కించు కునేదెవ‌రు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌వైపు.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. ఎవ‌రి వ్యూహాలు వారు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి గెలుపైనా అంత ఈజీకాద‌ని అంటున్నారు. సో.. ప్ర‌తి ఒక్క‌రి ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంద‌నేది.. తాజాగా పార్టీ అధిష్టానం చేయించిన స‌ర్వేని బ‌ట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే.. ముఖ్యంగా మంగ‌ళ‌గిరిపై వైసీపీ ఫొక‌స్ పెట్టింది.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్ని క‌ల్లో నారా లోకేష్‌ను ఆయ‌న ఓడించారు. అయితే.. ప‌రిస్థితి ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుందని అంటున్నారు. అది కూడా స్థానికంగా చేయించిన అంత‌ర్గ‌త స‌ర్వేలో .. ఆళ్ల‌కు పెద్ద‌గా మార్కులు ప‌డ‌లేద‌ని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఆదిలో బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆళ్ల ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేదు. ఇది వాస్త‌వం.

ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా.. గ‌త ఎన్నిక‌ల్లోఇచ్చిన హామీల‌ను ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. ఇళ్ల ప‌ట్టాలు.. గురించి.. ప్ర‌ధానంగా ఇక్క‌డివారు ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై ఆయ‌న ఎవ‌రికీ స‌మాధానం చెప్ప‌లేక పోయారు. ఇక‌, క్లాస్‌జ‌నాల‌కు వ‌చ్చే స‌రికి.. ప‌న్నుల‌పై ఎక్కువ‌గా ఆళ్ల‌ను నిల‌దీశారు. చెత్త‌ప‌న్నుల‌పై.. మ‌హిళ‌లు ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ, ఇక్క‌డ ప్ర‌జ‌లు మాత్రం ఎమ్మెల్యేను గ‌ట్టిగా నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. స్థానికంగా.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌ని.. తాడేప‌ల్లి పార్టీ కార్యాల‌యం లోనే ఉంటున్నార‌నేది మ‌రో.. విమ‌ర్శ‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌తంగానే.. ఆళ్ల ప‌లుకుబ‌డిపైనా.. ఆయ‌న ఇమేజ్‌పైనా తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని అంటున్నారు. మ‌రోవైపు లోకేష్ ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. ఈ సారి సానుభూతి క‌నిపిస్తోంది.

దీనికి తోడు రాజ‌ధాని మార్పు ఎఫెక్ట్ చాలా ఎక్కువుగా మంగ‌ళ‌గిరిలో ఉంది. పైగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమి లేద‌న్న విమ‌ర్శ‌లు స్థానికంగానే ఉన్నాయి. ఇవ‌న్నీ ఇలాగే కొన‌సాగితే.. మూడోసారి ఆళ్ల గెలుపు క‌ష్ట‌మేన‌ని.. ఈ సారి బంప‌ర్‌ మెజారిటీతో అయినా.. టీడీపీ ఇక్క‌డ గెలిచే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

This post was last modified on July 29, 2022 5:06 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

31 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago