తెలంగాణలోనూ టీడీపీని పరుగులు పెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు చంద్రబాబుని కోరారు. తప్పక హాజరవుతానన్న హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వవైభవానికి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని చంద్రబాబును కోరారు.
విలీన గ్రామాలైన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం ప్రజలు జేఏసీ నేతలు చంద్రబాబుని కలిశారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఉండలేమని తెలంగాణాలో కలపిందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందచేశారు.
భద్రాచలంలో గోదావరి కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని స్పష్టం చేశారు.
అనంతరం చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలో చంద్రబాబుకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో… శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
This post was last modified on July 29, 2022 5:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…