క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్టు.. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యే స్టిక్కర్ విషయంపై వివరణ ఇచ్చారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదే అని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఆ స్టిక్కర్ మాత్రం మార్చి 2022 నాటిదని పేర్కొన్నారు.
దాన్ని మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని.. అది ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. ఆ స్టిక్కర్ నాదే. అది మార్చి 2022 నాటిది. నాక్కూడ తెలువదు. మీడియా ద్వారానే తెలిసింది. నేను మూడు నెలల కిందనే పడేస్తే.. ఎవరైనా తీసి పెట్టుకోవచ్చు. దానికి నాకేం సబంధం ఉంటుంది. అని మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. అంతేకాదు.. ఆయన ఒక లాజిక్కు చెప్పారు. దేశంలో ఎక్కడో ఎవడైనా.. తన పేరు చెప్పుకొన్నంత మాత్రాన.. అన్నీ తాను చేస్తున్నట్టేనా? అని ప్రశ్నించారు. మరి దీనిపై ఈడీ అధికారులుఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 29, 2022 4:31 pm
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…