వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ తనయ షర్మిలపై టీఆర్ఎస్ కీలక నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజన్న రాజ్యం కావాలని ఎవరైనా అనుకుంటే.. వాళ్లు తక్షణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్నకు వ్యతిరేక రాజ్యం. రాజన్న(వైఎస్)తెలంగాణ విషయంలో ఏమన్నాడో.. వాళ్లు(షర్మిల అండ్ కో) మరిచిపోయినా.. తెలంగాణ సమాజం మాత్రం మరిచిపోలేదు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్రజలే తరిమేస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవరైనా తెలంగాణణకు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుందని.. వైఎస్ అనలేదా? ఆ విషయంపై షర్మిల ఏం సమాధానం చెబుతారో చూస్తామని అన్నారు.
గతం తెలియని.. వాళ్లు.. గతం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వచ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్కడున్న ప్రజలు పిచ్చివాళ్లని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మతో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్కడ షర్మిల పప్పులు ఉడకవ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
తెలంగాణను సంప్రదించకుండానే పోలవరంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మద్రాస్లో కలిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.
మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.
This post was last modified on July 29, 2022 1:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…