వేలాదిమంది వైద్య విద్యార్ధులు నిండా మునిగి పోయినట్లే అనిపిస్తోంది. వీరంతా ఉక్రెయిన్లో వైద్య విద్య చదవటానికి వెళ్ళి తిరిగి వచ్చేసినవారే. ఉక్రెయిన్లో చదువుకునేందుకు ఇండియా నుండి సుమారు 25 వేల మంది వెళ్ళారు. వీరిలో 20 వేలమంది వైద్య విద్యను చదువుతున్నారు. యుద్ధం మొదలవ్వటానికి ముందే వీళ్ళల్లో అత్యధికుల వైద్య విద్య అయిపోయింది. కాకపోతే ఫైనల్ పరీక్షలు జరగాల్సుండగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
కొద్దిరోజుల్లో యుద్ధం అయిపోతుందని తమ చదువు అయిపోతుందని భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. యుద్ధం మొదలైన సుమారు 20 రోజులకు విదేశాల నుండి వచ్చి చదువుకుంటున్న వారందరినీ ఉక్రెయిన్ ప్రభుత్వం పంపేసింది. అంతకుముందే చాలా దేశాలు ఉక్రెయిన్ తో మాట్లాడుకుని తమ దేశాలకు చెందిన వాళ్ళందరినీ పిలపించేసుకున్నాయి. యుద్ధం కారణంగా వైద్య విద్యార్ధులు కూడా మనదేశానికి వచ్చేశారు.
ఇప్పుడిక్కడ సమస్యేమిటంటే ఉక్రెయిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను ఇండియాలో పూర్తిచేయటానికి అనుమతివ్వాలంటు గోల మొదలుపెట్టారు. దీనికి కేంద్రప్రభుత్వం కుదరదని చెప్పేసింది. ఒకరినో ఇద్దరినో అయితే ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసే అవకాశాలున్నాయోమో. కానీ ఇక్కడ సర్దుబాటు చేయాల్సింది ఏకంగా 20 వేల మందిని. ఇన్ని వేల మందిని ప్రభుత్వం లేదా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడా సర్దుబాటు చేసేందుకు లేదు. ఉక్రెయిన్ నుండి వచ్చేసిన వారిలో ఐదు, ఆరో సంవత్సరాల విద్యార్ధులే.
ఉక్రెయిన్లో మెడిసిన్ అంటే 6 ఏళ్ళు చదవాలి. ఇన్ని వేల మందిని సర్దుబాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పేసింది. విద్యార్ధులేమో ముందు తమకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కోరారు. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలిస్తుండగానే కొందరు సుప్రిం కోర్టులో కేసు వేశారు. సుప్రింకోర్టు కూడా వీరి విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అయితే నియమ, నిబంధలను పరిశీలించిన కేంద్రం ఫైనల్ గా వీరికి అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది. ఇపుడు కేంద్రంపై విద్యార్ధులంతా మండిపోతున్నారు. చివరకు ఈ వివాదం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 29, 2022 11:43 am
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…