Gulte TeluguGulte Telugu Telugu Political and Movie News Updates

  • Home
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా రివ్యూ
  • ట్రెండ్స్
  • English
Home/Political News/దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం వాడేసింది: ఉద్యోగ సంఘాల ఫైర్‌

దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం వాడేసింది: ఉద్యోగ సంఘాల ఫైర్‌

Article by Satya Published on: 2:15 pm, 28 July 2022

ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. త‌మ సొమ్మును కూడా ప్ర‌భుత్వం వాడుకుంద‌ని.. త‌మ‌కు ఏ మాత్రం ప్రయోజ‌నాలు చేకూర్చ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు. ఒక ఉద్యోగి త‌న కూతూరు పెళ్లి కోసం జీపీఎఫ్‌ లోన్‌కు పెట్టుకుంటే మనవరాలి బారసాలకు కూడా రాలేదని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచామన్నారు.

బుధ‌వారం.. ఏపీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల నేతృత్వంలో.. మంత్రి వర్గ ఉపసంఘ సమావేశం జ‌రిగింది. దీనికి ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి హాజ‌ర‌య్యారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌య‌త్నించారు.

అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక ఉద్యోగి కూతురి పెళ్లి కోసం జీఫీఎఫ్‌ పెట్టుకుంటే మనవరాలి బారసాలకు రాలేదన్నారు. ఇదే అంశాన్ని ఉపసంఘం భేటీలో ప్రస్తావించినట్టు తెలిపారు. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ ఈ నెలాఖరుకు జమ చేస్తామన్నారని, అదీ జరగలేదని చెప్పారు. త‌మ సొమ్మును కూడా వాడేసుకుంటే.. ఎలా? అని ప్ర‌శ్నించారు.

ఉద్యోగుల హెల్త్‌ స్కీం పైనే సమావేశంలో ఎక్కువ చర్చ జరిగిందని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్ఎ్‌సను కూడా అనుమతించాలని కోరామన్నారు. ఈహెచ్ ఎస్‌లో కూడా గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు చేయాలని కోరామన్నారు. దీనిపై ఉత్తర్వులు ఇచ్చేలా చూస్తామని మంత్రి బొత్స, సజ్జల హామీ ఇచ్చినట్టు తెలిపారు.

ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వ ర్లు తెలిపారు. జీపీఎఫ్‌ సొమ్మును ఈ నెలాఖరుకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికీ నెర వేరలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారన్నారు. ఆరోగ్యశ్రీ మాదిరిగా అన్ని జబ్బులకూ ఈహెచ్ ఎస్ కార్డులకు కూడా వర్తించేలా చూడాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.5 లక్షలకు పెంచాలని కోరామని తెలిపారు. త‌మ సొమ్ములను త‌మ‌కు త‌క్ష‌ణ‌మే జ‌మ చేయాల‌ని కోరిన‌ట్టు తెలిపారు.

Tags Bandi Srinivas rao Botsa Satyanarayana Employee GPF account

Latest Stories

  • అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

    2 hours ago
  • జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

    8 hours ago
  • చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

    13 hours ago
  • కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

    14 hours ago
  • పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

    15 hours ago

Most Viewed

  • అర్ధరాత్రి మాట కోసం 'అఖండ 2' సిద్ధం
    అర్ధరాత్రి మాట కోసం 'అఖండ 2' సిద్ధం
  • నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా
    నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా
  • చైతూ వివాహ వార్షికోత్సవం... దర్శకుడి పోస్టు వైరల్
    చైతూ వివాహ వార్షికోత్సవం... దర్శకుడి పోస్టు వైరల్
  • అఖండ 2 ఆగింది... అసలేం జరుగుతోంది
    అఖండ 2 ఆగింది... అసలేం జరుగుతోంది
  • ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా
    ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా
Gulte
Back To Top

Follow Us

     
  • About Us
  • Editorial Guidelines
  • Privacy Policy
  • Advertise With Us
  • Contact Us
Copyright © 2025 Gulte, All Rights Reserved.