Political News

డేటే లేటు.. పార్టీలో చేరటం పక్కా

తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డేటే లేటు.. ఇది క‌న్ఫ‌ర్మ్ కాగానే ఆయ‌న‌ను పార్టీలో చేర్చేసుకుంటాం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే బీజేపీలోకి చేర‌నున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. టీఆర్ ఎస్‌పై అవినీతిపై పోరాటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు కోమ‌టిరెడ్డి సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీఆర్ ఎస్‌ కోవర్టు రాజకీయాలను ముందు నుంచీ వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి అని తెలిపారు.

తొందరలోనే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని సమచారం వచ్చింది. త్వరలోనే డేట్‌ను ప్రకటిస్తాం. ఆయన రాకతో బీజేపీ ఇంకా బలపడుతోంది. ప్రజల్లో ఇంకా నమ్మకం ఏర్పడుతోంది. అని బండి వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

మలివిడత పాదయాత్ర సన్నాహక సమావేశం పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆగస్టు 2నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర ఏర్పాట్లపై కమిటీ బాధ్యులతో బండి సంజయ్ చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన మార్పు వచ్చిందన్న సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, టీఆర్ ఎస్‌ తక్కువ అంచనా వేశాయని తెలిపారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు.

This post was last modified on July 27, 2022 9:20 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

33 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

40 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago