ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. అలానే ఉండి.. ఇక్కడి సమస్యలపై స్పందించారు.
అయితే.. చిన్నారి ఏం చేశాడంటే.. సీఎం జగన్ జేబును తడిమాడు. ఆ చిన్నారి చేతికి జగన్ జేబులో పెన్ను కనిపించింది. ఇంకే ముంది.. చిన్నారి.. దానిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ముందు చేతికి అందకపోయినా.. తర్వాత.. రెండు చేతులతోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో దీనిని గమనించిన చిన్నారి తల్లి.. అతడిని వారించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి సీఎం జగన్ జేబులో ఉన్న పెన్నును లాగేయడంతో అది కాస్తా కింద పడింది.
దీంతో పక్కనే ఉన్న అధికారులు.. వెంటనే స్పందించి.. సదరు పెన్నును తీసి.. సీఎంకు అందించారు. ఆ పెన్నును సీఎం జగన్ ఆ చిన్నారికే బహూకరించారు. ఇదీ.. స్టోరీ.. అయితే.. ఇందులో వింతేముంది? అంటున్నారా? కట్ చేస్తే.. సీఎం జగన్ వాడే ఆ పెన్ను ఖరీదు.. ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత.. సదరు పెన్నుపై నెటిజన్లు జోరుగా సెర్చ్ చేశారు.
ఈ క్రమంలో ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో విక్రయానికి ఉంచిన ఆపెన్ను.. మౌంట్ బ్లాంక్-145 మేస్టర్ స్టిక్ క్లాసిక్ గోల్డ్ ఫౌంటెన్ పెన్. దీని ఖరీదు అక్షరాలా 69,999(అది కూడా డిస్కౌంట్‌తో) రూపాయలు. దీని అసలు ఖరీదు 75999 రూపాయలు. బంగారు పాళీతో తయారు చేసిన ఈ పెన్నును సీఎం వినియోగిస్తారని తెలుసుకుని.. నెటిజన్లు అవాక్కయ్యారు. ఇక, ఈ పెన్నును సొంతం చేసుకున్న చిన్నారి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on July 26, 2022 11:00 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…