Political News

మ‌రింత పెరిగిన గ్యాప్‌.. కేసీఆర్‌ పై గ‌వ‌ర్న‌ర్ హాట్ కామెంట్స్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైల మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గ‌తంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. త‌న‌కు ప్రొటోకాల్ ఇవ్వ‌డం లేద‌ని గ‌వ ర్న‌ర్‌.. రుస‌రుస లాడుతున్నారు. ఇక‌, ఆమె గ‌వర్న‌ర్‌గా కాకుండా.. మోడీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్నా ర‌నేది కేసీఆర్ భావ‌న‌. కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారం నుంచి ఇలా.. ఇరు ప‌క్షాల మ‌ధ్య దుమారం కొన‌సాగుతూనే ఉంది.

ఇక‌, రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో ఒకింత క‌లిసిన‌ట్టు క‌నిపించినా.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ ఇరువురు నేత‌ల మ‌ద్య ఉన్న వివాదాలు మ‌రింత పెరుగుతున్నాయ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో త‌మిళ‌సై, కేసీఆర్ లు విడివిడిగా పర్య‌టించారు. వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యాల్లో ప్ర‌భుత్వం ప‌ని ప్ర‌భుత్వం చేస్తుంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వం నుంచి నివేదిక కోరే అవ‌కాశం ఉంది.

అయితే.. నేరుగా గ‌వ‌ర్న‌ర్ రంగంలోకి దిగిపోయి.. భ‌ద్రాచలంలో పర్య‌టించ‌డం.. వివాదానికి మ‌రింత ఆజ్యం పోసింది. ఇక‌, ఇప్పుడు తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగార‌నే చెప్పాలి. రాజ‌కీయాలు మాట్లాడ‌ను అంటూనే కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ఇమ‌డ‌లేర‌ని అంటూనే కేంద్రంలో కేసీఆర్ రాజ‌కీయాలు సాగ‌వ‌ని.. హెచ్చ‌రించారు. క్లౌడ్ బ‌రస్ట్ వ్యాఖ్య‌ల‌ను లైట్ తీసుకున్న‌ట్టు చెప్పారు.

“నేను రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్రొటోకాల్ ఆశించ‌డం లేదు. సీఎంగా ఆయ‌న‌కు ఉన్న హ‌క్కులు ఉంటే.. నాకు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ర్య‌టించే హ‌క్కు.. ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడే హ‌క్కు ఉన్నాయి. క్లౌడ్ బ‌ర‌స్ట్ వ్యాఖ్య‌ల‌పై నేను బ‌ర‌స్ట్ కాను. జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ఆట‌లు సాగ‌వు. జాతీయ రాజ‌కీయాల్లో గుర్తింపు కోసమే ఆయ‌న మోడీని విమ‌ర్శిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నం వృథా” అని త‌మిళ సై వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి.. ఈ రెండు ప‌క్షాల మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 25, 2022 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago