Political News

జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు నీతులు చెబుతారా? : కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ అస‌మ్మ‌తి మునుగోడు ఎమ్మెల్యే , తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రెండు విష‌యాల‌ను క్లియ‌ర్‌గా చెప్పేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు.. బీజేపీ కండువా వేసుకుంటున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించిన‌ట్టే ఖండించి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే త‌ప్పులేద‌ని చెప్పేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

జైలుకు వెళ్లివ‌చ్చిన నేత‌ల‌తో నీతులు చెప్పించుకునే(ఓటుకు నోటు కేసులో) ప‌రిస్థితిలో తాను లేన‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు.. రాజకీయ, రాజీనామా అంశాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. పార్టీ మారాల్సి వస్తే.. స్థానిక ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని గతంలోనే చెప్పానని.. ఇప్పటికి అదే మాటకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

సమయం వచ్చినపుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని రాజ‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ వ్యూహంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయన్న రాజగోపాల్.. ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో తాను నీతులు చెప్పిం చుకోలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“పార్టీ మారుతున్నానంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందరి సమక్షంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశాను. రాజకీయ, రాజీనామా అంశాలు మా మధ్య చర్చకు రాలేదు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం అప్పుల పాల్జేసిందని వివరించా. ఉప ఎన్నిక వస్తుందని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. గట్టుప్పల్‌ను మండలం చేసి నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత టీఆర్ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలవాలని సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదు. కాంగ్రెస్‌ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం. కాంగ్రెస్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నేను ఏమీ అనలేదు. ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్‌ బాధ్యతలు ఇచ్చారు.” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 25, 2022 4:37 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

1 hour ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago