జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక లక్ష్యం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కిం చుకుని అధికారంలోకి రావాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. పొత్తులు ఉంటాయా.. ఉండవా.. అనే విషయాన్ని పక్కన పెడి తే.. ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన లక్ష్యం అధికారమే కాబట్టి.. ఆయన పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ లక్ష్య సాధనకు కలిసి వచ్చేవారేరీ? అనేదే ఇప్పుడు ప్రశ్న. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన వారెవరూ.. ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. సో.. ఉన్నదంతా అభిమాన గణమే!
పవన్ ఎక్కడ సభ పెట్టినా.. ఏ కార్యక్రమం నిర్వహించినా.. అభిమానులు పోటెత్తుతున్నారు. భారీ ఎత్తున ఈలలు వేస్తూ.. గోల గోల చేస్తున్నారు. పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సభలు కిక్కిరిసిపోతున్నాయి. ‘కాబోయే సీఎం పవన్’ అనే నినాదాలు కూడా మిన్నంటుతున్నాయి. అయితే.. ఇప్పుడు కావాల్సింది ఇంతేనా? ఇలా.. అరిచి గోల చేసి.. అభిమానం చాటుకుంటే సరిపోతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో ఎన్టీఆర్‌కు కూడా గ్రామ గ్రామ అభిమానులు పోటెత్తారు. బళ్లు కట్టుకుని వచ్చి.. ఆయన ప్రసంగాలు విన్నారు. ఆయన సభలను విజయవంతం చేశారు.
అయితే.. ఆ అభిమానాన్ని వారు అక్కడితో వదిలేయలేదు. తమ ఓటు రూపంలో సైకిల్‌పై గుద్దేశారు. ఫలితంగా పార్టీ పెట్టిన మూణ్నాళ్లకే అన్నగారు అధికారం అందుకున్నారు. ఇప్పుడు ఆ స్పృహ పవర్ స్టార్ అభిమానుల్లో ఎక్కడా కనిపించడం లేదు. కనిపించి ఉంటే.. పవన్ నిజంగానే ఈ పాటికి సీఎం అయి ఉండేవారనేది వాస్తవం. గత ఎన్నికల సమయంలోనూ అభిమానులు పోటెత్తారు. కానీ, ఆ అభిమానాన్ని వారు ఓటు రూపంలో కురిపించలేక పోయారనేది నిష్టుర సత్యం. ఇక, ఇప్పుడైనా.. ఆ దిశగా పవన్ అభిమానులు ముందుకు కదలాలనేది జనసేన అభిమానుల మాట.
ప్రత్యక్షంగా అభిమానులు తమ ఓటును వేయడంతోపాటు.. పరోక్షంగా.. పవన్ నినాదాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా వారు సూచిస్తున్నారు. పవన్ వచ్చినప్పుడు పండగ.. ఆయన లేక పోతే.. దండగ అన్నట్టుగా ఉన్న పార్టీని చేతనం చేసేందుకు.. చొరవచూపాల్సిన.. అభిమానం చాటుకోవా్ల్సిన సమయం ఆసన్నమైందన్నది అభిమానుల మాట. ఒక్కొక్క పవన్ అభిమాని.. పది ఇళ్లను దత్తత తీసుకుని.. వచ్చే రెండేళ్లలో.. జిల్లాలు.. మండలాలు.. నగరాలు.. గ్రామాల్లో పర్యటించి.. పవన్ కోసం.. కృషి చేస్తే.. ఫలితం కళ్లముందు కనిపిస్తుందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. కానీ, ఆ దిశగా కదిలేది ఎవరు? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on July 25, 2022 10:57 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…