Political News

జ‌గ‌న్‌కే అభిమానులం.. పార్టీ మార‌ను..

వైసీపీ నాయ‌కుడు.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. ఒంగోలు పార్ల‌మెంటు స‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో త‌న‌పైనా.. త‌న కుటుంబం పైనా జ‌రుగుతున్న రాజ‌కీయ ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. తాను, త‌న కుటుంబం.. త‌న సొద‌రులు కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు అభిమానుల‌మేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ కుటుంబంపై వ‌స్తున్న వార్త‌ల‌ను ఇప్ప‌టికైనా క‌ట్టిపెట్టాల‌న్నారు.

గ‌త కొన్నాళ్లుగా.. మాగుంట వ్య‌వ‌హార శైలిపై.. అనేక మీడియాల్లో విస్తృతంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో ఆయ‌న టీడీపీ ఎంపీల‌కు పార్టీలు ఇవ్వ‌డం.. వారితో క‌లిసి ఫొటోలు దిగ‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ స‌మ‌యంలోనే ఒంగోలులో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డం.. మంత్రులు సురేష్‌, బాలినేని శ్రీనివాస‌రెడ్డిల‌తో కూడా ఆయ‌న‌కు పొస‌గ‌క పోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారుతున్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డింది.

అంతేకాదు.. క‌రోనా స‌మ‌యం లో ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని.. చేసేది కూడా నామ‌మాత్రంగానే ఉంద‌ని విప‌క్షాల కంటే ఎక్కువ‌గానే ఆయ‌న విమ‌ర్శించారు. క‌రోనా మందు త‌యారు చేసిన ఆనంద‌య్య తో ప్ర‌త్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి త‌న సొంత ఖ‌ర్చుల‌తో మందును పంపిణీ చేయ‌డం.. కూడా వైసీపీ కి ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీకి దూర‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

అయితే.. ఈ వాద‌న ఒక‌వైపు బ‌ల‌ప‌డుతున్న క్ర‌మంలోనే.. తాజాగా మాగుంట మీడియా ముందుకు వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే తాను ప‌నిచేస్తాన‌ని.. తాను.. త‌న కుటుంబం వైసీపీని వీడ‌బోమ‌ని.. వేరే పార్టీలో చేరేది కూడా లేద‌ని చెప్పారు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను జ‌గ‌న్ ఆహ్వానించార‌ని.. ఆయ‌న ఆహ్వానంతోనే వైసీపీలోకి వ‌చ్చాన‌ని చెప్పారు. తాము పార్టీని విడిచి పెట్టేది లేద‌న్నారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on July 25, 2022 6:59 am

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

47 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

53 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

3 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

5 hours ago