తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వేసిన అడుగులు.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో జరిగిన మార్పులు.. తెరవెనుక..జరుగుతున్న, జరిగిన పరిణామాలు.. వంటివి.. ఆయనకు షాక్ కొట్టించాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలోని మోడీకి భారీ షాక్ ఇవ్వాలని.. కేసీఆర్ అనుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలిచినా..గెలవకపోయినా.. ఆయన గట్టి పోటీ ఇచ్చేలా చేసి.. బీజేపీ ఉమ్మడి అభర్థికి తక్కువ మెజారిటీతో విజయం సాధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే అందివచ్చిన ప్రతి ఒక్కరితోనూ.. కేసీఆర్ ముందుకు సాగారు. అసలు.. కాంగ్రెస్ పొడ కూ డా గిట్టని.. కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీతో జాతీయస్థాయిలో సర్దుకు పోయారు. అయితే.. ఇంత జరిగినా.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పెద్దగా పోటీ ఇవ్వలేక పోయారు. పైగా.. తెరచాటున కాంగ్రెస్ నాయకులే.. ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బీజేపీ పక్షాల ఉమ్మడి అభ్యర్థి ముర్ము.. సునాయాశంగా రాష్ట్రపతి పీఠం ఎక్కేశారు. ఇది.. కేసీఆర్‌నుకలిచి వేస్తున్న అంశమని.. పరిశీలకులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పొచ్చు. కానీ, జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి మాత్రం.. చాలా విషయాలు చూసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకు భరోసా ఇచ్చి.. దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, జాతీయ రాజకీయాల్లో అలా కుదరదు. నాయకులకు భరోసా ఇవ్వాలి. ఇది అంత తేలికైన విషయం అయితే.. కాదు అని టీఆర్ ఎస్ కే చెందిన ఒక ఎంపీ.. రాష్ట్ర పతి ఎన్నికలకు ముందు.. ఆఫ్ దిరికార్డుగా మీడియాతో వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఇదే రాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అతి పెద్ద కాంగ్రెస్ పార్టీనే నాయకులను మేనే జ్ చేయలేక చేతులు ఎత్తేసింది. అలాంటిది..ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీ ఆర్‌కు ఇది సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా.. రాష్ట్రపతి ఎన్నికల విజయంతో మోడీ సహా కేంద్రంలోని బీజేపీకి మరింత జోష్ వచ్చినట్టయింది. తాము వేస్తున్న వ్యూహాలు సక్సెస్ కావడం.. విపక్షాల మధ్య అనైక్యత.. వంటివి ఆ పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రావడం.. అనేది కేసీఆర్‌కు అంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన తర్వాత స్టెప్ ఏంటనేది ఆసక్తిగా ఉంది.
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…