ఐటీడీపీ ప్రారంభించిన #APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచిం ది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీ పీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదని చాలా మంది బాధితులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత కోనసీమ, అల్లూరు జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ.. ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతే కాదు.. బురద పేరుకుపోయి..రహదారులు కూడా పూడుకుపోయాయి. ఇక, ఇళ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజలను అన్ని రూపాల్లోనూ ఆదుకుంటుదని అందరూ అనుకుంటారు. అయితే.. మొక్కుబడి.. నామమాత్రపు.. సేవలతో ప్రభుత్వం బాధితుల కళ్లు గప్పే ప్రయత్నం చేసింది. ఇదే.. బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.
ఈ నేపథ్యంలోనే బాధితులు ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్నారు. నిజానికి మహోగ్ర గోదావరి వరద కారణంగా.. వందల సంఖ్యలో గ్రామాలు.. లంక ప్రాంతాలు నీట మునిగాయి.అయితే.. అధికారులు మాత్రమే అంతో ఇంతో ప్రజల మద్యకు వచ్చారు. తప్ప.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు మాత్రం ఎక్కడా కనిపించలే దు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక ప్రభుత్వం పంచమని ఆదేశించిన కిలో టమాటాలు.. కిలో బంగాళ దుంపలు.. కిలో ఉల్లిపాయలు వంటివి కూడా కేవలం నాలుగేసి చొప్పున మాత్రమే ఇస్తున్నారనేది బాధితుల ఆవేదన.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నాయకులను రంగంలోకి దింపి.. సాయం అందించేందుకు ప్రయత్నించారు. ఇది సక్సెస్ అయింది. దీంతో ఏపీ ప్రజలు చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారనే అంశం తెరమీదికి వచ్చింది. దీనికి మెజారిటీ ప్రజలు లైకులు కొట్టడం, రీ ట్వీటులు చేయడం.. వంటివి రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే, బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మరి తాజాగా వెల్లడైన రిజల్ట్ ను బట్టి వైసీపీ సర్కారు ఎంతబాగా పనిచేస్తోందో అర్ధం అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 21, 2022 2:17 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…