దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలకు షాకుల మీద షాకులు ఇవ్వటంతో మోడీ అండ్ కో టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశ ముఖచిత్రాన్ని మార్చేయొచ్చన్నట్లుగా గొప్పలు చెప్పే స్థానే.. తాజాగా అలాంటి డబుల్ ఇంజిన్ సర్కారులో కీలకమైన యూపీలోని యోగి ప్రభుత్వానికి పంచ్ పడింది. సొంత పార్టీకి చెందిన నీటిపారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపారు.
ముఖ్యమంత్రి తనను అవమానిస్తున్నట్లుగా పేర్కొన్న దినేశ్.. గడిచిన వంద రోజులుగా తనకు పనులు అప్పజెప్పటం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. తన శాఖకు సంబంధించిన బదిలీల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణల్ని సంధించారు. తానెంతో బాధ పడిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. తాను దళితుడ్ని కావటంతోనే పక్కన పెట్టారని.. తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్ర మంత్రిగా ఉంటూ కూడా తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. తనను పక్కన పెట్టేశారన్నారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేవని.. దీని వల్ల దళిత వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తనను ఏ మీటింగ్ కు పిలవరన్న దినేశ్.. తన మంత్రిత్వ శాఖ గురించి తనకేం చెప్పరన్నారు. ఇలా.. యోగి సర్కారు మీద బోలెడన్ని విమర్శలు.. ఆరోపణలు చేస్తూ.. తన రాజీనామా లేఖతో ప్రకంపనల్నిస్రష్టిస్తున్నారు దినేశ్. ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే వేళలో.. ఇలాంటి పరిణామం షాకిచ్చినట్లేనన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 21, 2022 10:24 am
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…