గుంటూరు వైసీపీ రాజకీయాలు తాడేపల్లి ప్యాలస్‌కు చేరుకున్నాయి. తాజాగా నరసారావుపేట ఎంపీపై ఒక ఎమ్మెల్యే ఘాటుగా ఫిర్యాదు చేసినట్టు పార్టీలో గుసగుస వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఎక్కువగా ఉందని.. కనీసం తనను కూడా పట్టించుకోవడం లేదని.. ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం గుంటూరులోనూ చర్చకు దారితీసింది. ఇటీవల కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. పల్నాడు జిల్లాలో(కొత్తది) గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి వీటిని వెచ్చించాలి.
అయితే.. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా అక్కడ పర్యటించి.. అధికారులతో చర్చించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయించాలో కూడా తెలుసుకున్నారు. అయితే.. ఈ క్రమంలో తనను సంప్రదించకుండా. ఆయన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వాదన. పైగా.. ఆది నుంచి కూడా ఎంపీ.. వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య వివాదాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మరింత పెరిగాయని అంటున్నారు.
ఇక, ఈ విషయంపై ఎంపీ కార్యాలయం భిన్నంగా రియాక్ట్ అయింది.. మేం చేస్తున్నది.. అభివృద్ధి పనులే కదా.. రాజకీయం కాదు.. కదా.! అని ప్రకటన జారీ చేసింది. అంటే.. ఎమ్మెల్యేగా ఉన్న నేను.. అభివృద్ధి చేయకుండా.. రాజకీయం చేస్తున్నానని.. ఎంపీ అంటున్నారని.. ఇది సరికాదని.. ఆయనను మార్చాల్సిందేనని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వరాదని.. ఘాటుగా.. తాడేపల్లి అధిష్టానానికి కాసు మహేష్‌రెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది.
సామాజిక వర్గం పరంగా కూడా.. ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. టీడీపీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమను పట్టించుకోవడం లేదని.. కనీసం.. తమను గుర్తించడం లేదని.. రాజధాని రైతు నేతలతో తరచుగా ఫోన్లో మాట్లాడుతున్నారని.. కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం.. సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి అధిష్టానం.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అంటున్నారు సీనియర్ నేతలు.
This post was last modified on July 19, 2022 4:44 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…