Political News

జోరు పెంచిన రేవంత్‌.. అధికార‌మే టార్గెట్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా పార్టీనిముందుకు న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. త‌ద్వారా.. పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం వంటి కీల‌క ప‌రిణామాల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ… రేవంత్‌రెడ్డి జోరు పెంచ‌డంరాజ‌కీయగా చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, 36 మంది డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు.. జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి నివేదించారు.

ఇప్పటికే ఉన్న ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా.. మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్లేట్లు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టి.. ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరికలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే జాబితాను అధిష్ఠానానికి అందజేసినట్లు సమాచారం. సీనియర్లను కట్టడి చేసుకుంటూ.. పార్టీలో దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి … అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలను డిఫెన్స్‌లోప‌డేసేలా.. 90 లక్షలు ఓట్లు వస్తాయని.. 70 స్థానాల్లో గెలిచి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు 40లక్షలకుపైగా సభ్యత్వాలు ఉండడంతో ఒక్కో సభ్యుడు ఒక్క ఓటు వేసినా.. తాను అనుకున్న సీట్లు వస్తాయన్న ధీమాతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో ఆయ‌న అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలపై విమర్శలను తగ్గించి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమి చేస్తుందో.. స్వయాన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పీసీసీ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించడంతో… పార్టీలో జోష్‌ పెరిగి.. ఏకంగా మూడు శాతం ఓటింగ్‌ పార్టీకి పెరిగినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతు డిక్లరేషన్‌ను రైతురచ్చబండ పేరుతో.. జనంలోకి తీసుకెళ్లి పెద్దఎత్తున ప్రచారం కల్పించారు.

ఇప్పుడు తాజాగా.. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న విద్యార్థి నిరుద్యోగ సభలో… నిరుద్యోగ యువత డిక్లరేషన్‌ ప్రకటించేందుకు పార్టీ కసరత్తు పూర్తి చేసింది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి.. వరదలు రావడంతో… వచ్చేనెల రెండో తేదీన సభ నిర్వహించడం సరికాదన్న ఆలోచనతో ఉన్న రేవంత్‌రెడ్డి… రాహుల్‌ గాంధీతో చర్చించి వాయిదా వేయించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా.. తాజాగా మారుతున్న ప‌రిణామాలు.. రేవంత్ దూకుడు వంటివి పార్టీ విజ‌యంపై ఆశ‌ల‌ను పెంచుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 19, 2022 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago