Political News

త‌మ్ముళ్లూ తెలుసుకోండ‌యా.. ఇదీ.. బాబుకు జ‌గ‌న్‌కు ఉన్న తేడా..!!

ఔను! రాజ‌కీయ విశ్లేష‌కులు ఇదేమాట చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని.. పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌పిస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌ను త‌న సొంత మ‌నుషులు చూస్తూ..నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ.. ఈ వ‌య‌సులోనూ.. 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉండికూడా.. ఆయ‌న నిరంత‌రం.. ప‌నిచేస్తున్నారు. ఎక్క‌డా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని.. పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు.. త‌మ్ముళ్ల‌ను గెలిపించుకునేందుకు.. నియోజ‌క‌వ‌ర్గాలు.. జిల్లాలు.. ఇలా.. అన్ని రూపాల్లోనూఆయ‌న పార్టీని అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. “న‌న్ను చూసి గెలిపించండి!” అని ఆయ‌న‌గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ.. ఇప్పుడు కూడా ప్ర‌జ‌ల‌కు విన్న‌విస్తున్నారు.

అయితే.. పార్టీలో నాయ‌కులు మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ అన్న‌ట్టుగా ఉన్నారు. కొంద‌రు యాక్టివ్‌గా ఉంటే.. మ‌రికొందరు ‘అంతా బాబే చూసుకుంటారులే.. మ‌న‌కెందుకు’ అనే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో త‌మ్ముళ్లు తెలుసుకోవాలి. ఇక‌, ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఎమ్మెల్యేల‌కు రూపాయి ఇవ్వ‌డం లేదు. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడేళ్లయినా.. అభివృద్ధి లేదు. గుంత‌లు పూడ్చ‌మ‌న్నా దిక్కులేదు. దీంతో అస‌లు ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి.

దీనికి కార‌ణం.. స్వ‌యానా సీఎం జ‌గ‌న్. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆయ‌న మాత్రం.. అంతా ఎమ్మెల్యేల‌పైనే భారం వేసేశారు.”మిమ్మ‌ల్ని మీరే గెలిపించుకోండి.. న‌న్ను మాత్రం సీఎం చేయండి” అనే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికి రెండు సార్లు ఎమ్మెల్యేల‌తో మీటింగ్ పెట్టి ఆయ‌న చెప్పింది ఇదే. మ‌రి దీనిని బ‌ట్టి.. నాయ‌కుల విష‌యంలోనూ.. పార్టీ విష‌యంలోనూ.. ఎవ‌రు కేర్ తీసుకుంటున్నారు? అనేది త‌మ్ముళ్లు ఆలోచించుకోవాలి. అన్నీ నేను చూసుకుంటాను.. అనే ధైర్యం ఇస్తున్న చంద్ర‌బాబు ఉద్దేశాన్ని ఇప్ప‌టికైనా.. త‌మ్ముళ్లు అర్ధం చేసుకుంటారా? లేదా..? అనేది చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 19, 2022 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంతను మ్యాచ్ చేయగలదా అన్నారు.. కానీ

‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…

1 hour ago

సినిమాల్లాగా రాజ‌కీయాల్లోనూ సైలెంట్ స‌క్సెస్‌!

కోలీవుడ్‌లో పిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాయించుకున్న‌యువ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…

2 hours ago

శివన్న సైలెంటుగా హిట్టు కొట్టేశాడు

జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…

2 hours ago

అలా చేస్తే రేపు అసెంబ్లీకి జగన్..కోటంరెడ్డి చిట్కా

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

6 సినిమాలతో కొత్త శుక్రవారం రెడీ

గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…

4 hours ago

ఎర్రచందనం దుంగల్లో అంత్యక్రియల రహస్యం

ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…

5 hours ago