టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారును, ముఖ్యంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి.. ఆసక్తికర మైన ట్వీట్ చేశారు. “లెక్క చూసుకో జగన్ రెడ్డీ.. నాలుగంటే.. నాలుగే!!” అని నర్మగర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. విషయం లోకి వెళ్తే.. గోదావరి జిల్లాలను వరద ముంచెత్తింది. దీనికి సంబంధించి ప్రభుత్వం… వరద బాధితులను ఆదుకుంటా మని ప్రకటించింది. సీఎం జగన్ దీనిపై వరుస సమీక్షలు కూడా చేశారు. అధికారులను సైతం మందలించారు. సరిగా పనిచే యాలని అన్నారు. అదేసమయంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు.
వరదలతో అతలాకుతలమై.. పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు ఒక్కొ క్క కుటుంబానికి రూ.2 వేలు చొప్పున, ఒంటరి వ్యక్తులు అయితే.. రూ. వెయ్యి చొప్పున సాయం చేయాలని.. ఆదేశించారు. అదే సమయంలో వారు పునరావాస కేంద్రాల నుంచి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత.. ఇంటికి వెళ్లేప్పుడు నిత్యావసర వస్తువులను దండిగా ఇచ్చి పంపించాలని.. నెల రోజుల పాటు వారు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. వండుకుని తినేందుకు అవసరమైన అన్ని సరుకులు ఇచ్చి పంపించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తానే స్వయంగా సరుకుల లిస్టును కూడా చదవి వినిపించారు.
దీనిలో కిలో బంగాళ దుంపలు, పాతిక కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, లీటరు మంచినూనె(పామాయిల్ కాదు), ఉప్పు ప్యాకెట్, కారం 100 గ్రాములు.. ఇలా.. సరుకులు కేటాయించారు. వీటిని తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. అయితే.. క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి మాత్రం బాధిత కుటుంబాలకు అధికారులు నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళ దుంపలు.. నాలుగు టమాటాలను చేతిలో పెట్టి.. పంపించారు. దీనిని కోట్ చేస్తూ..చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నాలుగంటే నాలుగే! ఇది జగన్ సర్కార్ వరద సాయం. నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు! ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి....నాలుగంటే నాలుగే! అని ట్వీట్ చేశారు. అదేవిధంగా అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టి లో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనాన్ని ఉటంకించారు. అయితే.. ఈ నాలుగు లెక్క దేనిగురించనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నాలుగంటే నాలుగే సీట్లు వస్తాయనే భావనతోనే చంద్రబాబు ఇలా ట్వీట్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on July 19, 2022 9:10 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…