మాజీ మంత్రి కొడాలి నాని అంటే చంద్రబాబునాయుడు అభిమానులకు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ మొట్టమొదటి టార్గెట్ మాజీమంత్రి కొడాలినానీయే అని స్పష్టంగా ప్రకటించారు.
టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చాలామందే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎంతో మంది పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు చాలా మందే ఉన్నారు. ఇంతమందున్నా అందరినీ వదిలిపెట్టేసి తమ మొదటి టార్గెట్ కొడాలే అని చెప్పారంటేనే వాళ్ళల్లో మాజీమంత్రి పై ఎంతగా కసి పేరుకుపోయిందో అర్ధమవుతోంది. సరే చంద్రబాబు వార్నింగులిచ్చినా, అనిత చెప్పినా ఏమి చేయగలరన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత మాట.
అనిత ఏమంటారంటే ఎవరి అకౌంట్లు వాళ్ళతోనే సెటిల్ చేసేస్తారట. ప్రత్యక్షంగా సెటిల్ చేయాల్సిన అకౌంట్లను ప్రత్యక్షంగానే సెటిల్ చేసేస్తారట. అలాగే కోర్టుల ద్వారా చేయాల్సినవి కోర్టుల ద్వారా చేస్తారట. తమను ఇంత ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతల సంగతేంటో చూడకపోతే అధికారంలోకి వచ్చి ఉపయోగం ఏముంటుంది ? అని అడిగారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు మాసాల్లోనే అన్నీ అకౌంట్లను సెటిల్ చేసేయటమైతే ఖాయమట.
పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల చావులకు తాము సమాధానం చెప్పుకోవాలి కదాని అనిత అడిగటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక కొడాలి తర్వాత టార్గెట్ మాత్రం విజయసాయిరెడ్డేనట. చేసిన పాపాలకు విజయసాయి సమాధానం చెప్పుకోవాల్సిందే అని అనిత హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ టీడీపీ టార్గెట్ లో జగన్మోహన్ రెడ్డి పేరును అనిత చెప్పపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కొడాలి అయినా విజయసాయి అయినా జగన్ కోసమే కదా పనిచేస్తున్నది. మరి జగన్ పేరు చెప్పకుండా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పటంలో ఆంతర్యం ఏమిటి ?
This post was last modified on July 18, 2022 9:02 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…