టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయన వచ్చిన సభా సమావేశాలకు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. వాస్తవానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ఆయన రాలేదు.
కానీ, సోమవారం దేశవ్యాప్తంగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అంతే తప్ప తన శపథాన్ని పక్కన పెట్టి మాత్రం కాదు. రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటు వేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ ప్రాంగణానికి విచ్చేసిన ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పత్రాన్ని తీసుకుని, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్, హోం శాఖా మంత్రి తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం, తదుపరి ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఓటు వేశారు.
This post was last modified on July 18, 2022 3:38 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…