ఏపీ సీఎం జగన్ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. అంబేడ్కర్ పేరును తొలగించిన మీరు.. ఆయనకు ఆరాధ్యులా..? ఆయనకు నివాళులర్పించే అర్హత మీకుందా? అని వ్యాఖ్యానించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే “ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ” పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు… ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం… ఇప్పుడు “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించింది. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on July 16, 2022 7:01 pm
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…