Political News

పార్ల‌మెంటులో తిట్ల దండ‌కం నిషేధం..!

పార్ల‌మెంటులో అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య తిట్ల దండ‌కం ఇక కుద‌ర‌దు. ఒక‌రిపై ఒకరు దారుణాతి దారుణంగా దూష‌ణ‌లు కొన‌సాగిస్తామంటే.. వీలు కాదు. ఈ మేర‌కు పార్ల‌మెంటు కొన్ని నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది.

ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ విడుదల చేసింది. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్ స్ప్రెడర్‌’, ‘స్నూప్‌ గేట్‌’ వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతో పాటు అతి సాధారణంగా ఉపయోగించే ‘సిగ్గు చేటు’, ‘వేధించడం’, ‘మోసగించడం’, ‘అవినీతిపరుడు’, ‘డ్రామా’, ‘హిపోక్రసీ’, ‘నియంత’ అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పేర్కొనడం గమనార్హం.

జులై 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో నిషేధిత పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. తాజా జాబితా ప్రకారం.. ‘శకుని,తానీషా’, ‘వినాశ పురుష్‌’, ‘ఖలిస్థానీ’, ‘ద్రోహ చరిత్ర’, ‘చంచా’, ‘చంచాగిరి’, ‘పిరికివాడు’, ‘క్రిమినల్‌’, ‘మొసలి కన్నీళ్లు’, ‘గాడిద’, ‘అసమర్థుడు’, ‘గూండాలు’, ‘అహంకారి’, ‘చీకటి రోజులు’, ‘దాదాగిరి’, ‘లైంగిక వేధింపులు’, ‘విశ్వాసఘాతకుడు’ వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదు.

సమయానుకూలంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రాల చట్టసభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవిగా ప్రకటిస్తుంటారు. రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.

నేను తిడ‌తా.. ఏం పీకుతారు?!

లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసిన తాజా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను కూడా మాట్లాడొద్దని చెప్పడం సరికాదంటూ టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ మండిపడ్డారు. తాను వాటిని ఉపయోగిస్తానని, ఏం పీకుతారో పీక్కోండ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అవసరమైతే సస్పెండ్‌ చేసుకోవచ్చని సవాల్ చేశారు.

”మరికొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి మేం ప్రసంగించేటప్పుడు సిగ్గుచేటు, వేధింపులు, మోసం, అవినీతి, అసమర్థుడనే సాధారణ పదాలను కూడా వాడకూడదంట. నేను ఆ పదాలను ఉపయోగిస్తాను. కావాలంటే సస్పెండ్‌ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడతా” అని ఓబ్రెయిన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

This post was last modified on July 14, 2022 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎర్రచందనం దుంగల్లో అంత్యక్రియల రహస్యం

ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…

2 mins ago

జ‌గ‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దు.. స్పీక‌ర్ ఏంచేయాలంటే?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స‌మావేశాల‌కు…

48 mins ago

నయనతార బయోపిక్కులో ఏముంది

రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…

1 hour ago

గ‌ద్ద‌ర్ కుటుంబానికి గౌర‌వం.. వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి

ప్ర‌జాయుద్ధ నౌక‌.. ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎన‌లేని గౌర‌వం ఇచ్చింది. గ‌ద్ద‌ర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెల‌ను…

2 hours ago

త‌మ‌న్ చేతిలో ఎన్ని సినిమాలు బాబోయ్

ద‌క్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే త‌మ‌న్ పేరు త‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ.. త‌న చేతిలో ఉన్న‌ప్రాజెక్టుల లిస్టు చూస్తే…

2 hours ago