వైసీపీ రెబల్ ఎంపీ… విశ్లేషకులు.. రఘురామకృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్యక్షుడిపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వత అధ్యక్షుడు ఉండరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలాశాశ్వత అధ్యక్షుడిని నియమించుకుంటుందని ప్రశ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తానని అన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో విజయసాయి ప్రవేశపెట్టిన వైసీపీ శాశ్వత అధ్యక్షుడి తీర్మానంపై ఆయన ఫిర్యాదు చేశారు.
అయితే.. సదరు తీర్మానం కాపీ.. తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని ఎంపీ రఘురామ తెలిపారు. తీర్మానం అందాక ఈసీ నిర్ణయిస్తుందన్నారు. శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతమని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తీర్మానంపై ఆయన చర్చించారు. విజయసాయి రెడ్డి తీర్మానం ఇంకా తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని రఘురామ అన్నారు. తీర్మానం అందాక.. ఈసీ నిర్ణయిస్తుందన్నారు.
“శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతం. ఇది మా పార్టీకి ఒక సెట్ బ్యాక్. భయాలు పెట్టుకుని శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్ యోచిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు ఈసీ ముందుకు రాలేదు. ఇదీ ఈసీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.” అని రఘురామ అన్నారు. జగన్‌ను ఏదో తెలియని భయం వెంటాడుతోందని చెప్పారు. ఈ భయమే ఆయన ఓటమికి దారితీస్తుందని.. వైసీపీ నిలువునా కాలిపోవడం ఖాయమని అన్నారు.
ఇదిలావుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైసీపీ నేతలు.. వాటిపై చర్చించారు. దీంతో రాజకీయంగా ఈ శాశ్వత నియామకం దుమారం రేపుతోంది. అన్ని వైపుల నుంచి వైసీపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా ఇలా శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించుకున్న దాఖలా లేదని పేర్కొన్నాయి.
This post was last modified on July 11, 2022 8:14 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…