Political News

‘జ‌గ‌న్‌ను ఆ భ‌యం వెంటాడుతోంది’

వైసీపీ రెబ‌ల్ ఎంపీ… విశ్లేష‌కులు.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వైసీపీపైనా.. ఆ పార్టీ అధ్య‌క్షుడిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ పార్టీకీ.. దేశంలో శాశ్వ‌త అధ్య‌క్షుడు ఉండ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎలాశాశ్వ‌త అధ్య‌క్షుడిని నియ‌మించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో విజయసాయి ప్రవేశపెట్టిన వైసీపీ శాశ్వత అధ్యక్షుడి తీర్మానంపై ఆయ‌న ఫిర్యాదు చేశారు.

అయితే.. స‌ద‌రు తీర్మానం కాపీ.. త‌న‌కు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని ఎంపీ ర‌ఘురామ తెలిపారు. తీర్మానం అందాక ఈసీ నిర్ణయిస్తుందన్నారు. శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతమని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తీర్మానంపై ఆయన చర్చించారు. విజయసాయి రెడ్డి తీర్మానం ఇంకా తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని రఘురామ అన్నారు. తీర్మానం అందాక.. ఈసీ నిర్ణయిస్తుందన్నారు.

“శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతం. ఇది మా పార్టీకి ఒక సెట్ బ్యాక్. భయాలు పెట్టుకుని శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ యోచిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు ఈసీ ముందుకు రాలేదు. ఇదీ ఈసీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.” అని ర‌ఘురామ అన్నారు. జ‌గ‌న్‌ను ఏదో తెలియ‌ని భ‌యం వెంటాడుతోంద‌ని చెప్పారు. ఈ భ‌య‌మే ఆయ‌న ఓట‌మికి దారితీస్తుంద‌ని.. వైసీపీ నిలువునా కాలిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

ఇదిలావుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ(వైసీపీ) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైసీపీ నేతలు.. వాటిపై చర్చించారు. దీంతో రాజ‌కీయంగా ఈ శాశ్వ‌త నియామ‌కం దుమారం రేపుతోంది. అన్ని వైపుల నుంచి వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ పార్టీ కూడా ఇలా శాశ్వ‌త అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించుకున్న దాఖ‌లా లేద‌ని పేర్కొన్నాయి.

This post was last modified on July 11, 2022 9:59 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago