తాజాగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఓ రేంజ్‌లో బీజేపీ విధానాలను ఉతికి ఆరేశారు. తమపైనా.. తమ ప్రభుత్వంపైనా ఈడీని ప్రయోగిస్తామని.. సీబీఐని ఉసిగొల్పుతామని.. పదే పదే బీజేపీ నేతలు చెబుతున్న వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. బీజేపీ విధానాలను ఆయన ఈ సందర్భంగా వీడియో రూపంలో బట్టబయలు చేశారు.
అప్పటి వరకు తప్పులు చేశారు.. తప్పులు చేశారు.. అన్న సీబీఐ.. బీజేపీలో చేరిన తర్వాత.. సదరు తప్పులు ఒప్పులు చేస్తోందా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గతంలో సీబీఐ, ఈడీ చేసిన దాడులు.. తర్వాత జరిగిన పరిణామాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు.
వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్‌టైజ్‌మెంట్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌తో కేసీఆర్ చూపించిన వీడియో.. తీవ్రస్థాయిలో సంచలనం రేపుతోంది. ఈ విడియోలో ఏముందంటే.. గతంలో టీడీపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది.
అయితే.. ఆయన బీజేపీలో చేరగానే ..అవన్నీ మాఫీ అయిపోయాయి. ఇక, ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ సీఎం రమేష్ ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. అయితే.. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరిపోవడంతో ఈడీ సైలెంట్ అయిపోయింది. ఇక, కాంగ్రెస్ నాయకుడు,అస్సాం కు చెందిన హిమంత బిశ్వశర్మ ఇంటిపైనా.. దాడులు జరిగాయి.
అయితే.. తర్వాత ఆయన కూడా కమలం గూటికి చేరుకున్నారు. ఆవెంటనే అసలు దాడులు ఏమైపోయాయో కూడా తెలియ లేదు. అదేసమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ నేత.. సువేందు అధికారిపై శారదా చిట్‌ఫండ్ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన బీజేపీ గూటికి చేరిపోవడంతో ఆ కేసులు ఎటు పోయాయో తెలియని పరిస్తితి. అదేవిధంగా ముకుల్ రాయ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సిందియాలపై గతంలో సీబీఐ దాడులు చేసింది.
అయితే.. వీరంతా బీజేపీలో చేరిపోవడంతో కేసుల ఊసు లేకుండా పోయింది. ఇక, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయాన్ని కూడా కేసీఆర్ ఈ వీడియోలో చూపించారు. మొత్తంగా.. ఈ వీడియో ద్వారా బీజేపీని ఏకేయడం గమనార్హం.
This post was last modified on July 11, 2022 10:58 am
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…