కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళని ఏ విషయంలో అయితే తప్పుపడుతున్నారో అవే తనకు కూడా వర్తిస్తాయని ఏ మాత్రం అంగీకరించరు. తాజాజా మీడియా సమావేశంలో నరేంద్రమోడిని, బీజేపీని అనేక విషయాల్లో తప్పుపట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించదా ? చట్టాలను ఫాలో అవ్వవా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా ? ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి లాగేసుకుంటారా ? నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా ? ప్రజాస్వామ్యమంటే బీజేపీకి అసలు లెక్కలేదా ?
ఇవి తాజాగా బీజేపీని ఉద్దేశించి కేసీయార్ సంధించిన ప్రశ్నలు. నిజానికి ఇదులో చాలావరకు తనకు కూడా వర్తిస్తాయని కేసీయార్ మరచిపోయారో లేదా కన్వీనియంటుగా మరచిపోయినట్లు నటించారో అర్ధంకావటం లేదు. విషయం ఏమిటంటే 2014లో కేవలం 62 సీట్లతో అధికారంలోకి వచ్చిన కేసీయార్ తర్వాత చేసిందేమిటి ? టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాగేసుకోలేదా ? పై పార్టీల ఎంఎల్ఏలను ఒత్తిడి పెట్టి మరీ లాక్కున్నారు కదా.
కేసీయార్ ఏమన్నా చట్టాలను ఫాలో అవుతున్నారా ? కేంద్రానికి వ్యతిరేకంగా తాను మాత్రం ఆందోళనలు చేస్తు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అనుకుంటున్న ప్రతిపక్షాలను చేయనిస్తున్నారా ? ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడిచేయటం లేదా ? న్యాయస్ధానాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్న కేసీయార్ మాత్రం లెక్కచేస్తున్నారా ? విభజన చట్టాని సక్రమంగా అమలు చేయమని హైకోర్టు ఆదేశిస్తే అమలుచేశారా ? పార్లమెంటు ద్వారా ఏర్పడిన విభజన చట్టాన్ని గౌరవించకుండా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర స్ధాయి సంస్ధలన్నీ తెలంగాణావే అని ఏకపక్షంగా సొంతం చేసుకోలేదా ?
నాన్ బీజేపీ ప్రభుత్వాలను కూల్చేస్తారా అని అడగటంలో కూడా అర్ధం లేదు. ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటి సీట్లు గెలిచిన చోటకూడా ఏదో పద్దతిలో వాళ్ళని లోబరుచుకుని టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చిందనిపించుకోలేదా ? ఇదంతా చట్టంపైన గౌరవముండే కేసీయార్ చేశారా ? కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలా వ్యవహరిస్తున్నారని కేసీయార్ ఆరోపిస్తున్నారో రాష్ట్రంలో తాను సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారని కేసీయార్ మరచిపోవటమే విచిత్రం.
This post was last modified on July 11, 2022 10:05 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…