వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే.. ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని పవన్ కల్యాణ్ హచ్చరించారు. అలాంటి ఉద్యమం వచ్చిన రోజున.. పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అధికారం ఉందని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు.. జాగ్రత్త అని సూచించారు. విజయవాడలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
ఎంబీకే భవన్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నామని.. సీఎం సంక్షేమ నిధి, ఆరోగ్యశ్రీలో అమలుకాని అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా రేణిగుంట మండలం తారకరామనగర్ వాసి తన ఇల్లు లాక్కున్నారని తన బాధను పవన్కు తెలియజేశారు. దీనిపై స్పందించిన పవన్.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఎంపీటీసీ లాక్కోవడం దారుణమన్నారు. లాక్కున్న ఇంటిని మళ్లీ మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఎందరో ఇబ్బంది పడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ఆదివారం నిర్వహించిన జనవాణిలో 427 అర్జీలు వచ్చాయని.. వచ్చే ఆదివారం భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
This post was last modified on July 10, 2022 2:05 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…