వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై పార్టీలో విశ్వసనీయత, నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పేరుతో ఆయన ఫొటోతోనే నాయకులు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ నమ్మకం ఇప్పుడు సడులుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. కుటుంబం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. రాష్ట్రంలో చర్చకు దారితీస్తున్నాయి. చెల్లిని, తల్లిని.. పక్కన పెట్టారనే వాదన ప్రతిపక్షం నుంచి వినిపిస్తోంది.
షర్మిల, విజయమ్మలను జగన్ వాడుకుని వదిలేశారని ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు.. ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. అదేసమయంలో నాయకుల మధ్య కూడా చర్చకు వస్తున్నాయి. ఇవి నైతికంగా .. జగన్ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి.. ఇదే పరిస్థితి ఉంటే.. జగన్‌ను నమ్మడం కష్టమనే అభిప్రాయం పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు జగన్ వెంట తిరిగిన వారు కూడా.. ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు.
ముఖ్యంగా గతంలో జగన్ వెంట తిరిగిన వారు.. ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఉన్న వారు కూడా ఆలోచనలో పడ్డారు. జగన్‌ను నమ్ముకున్నాం.. అయితే.. తమను ఏం చేస్తారో.. ఏమో.. అనే చర్చ జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల విషయానికి వస్తే.. ఇబ్బంది ఖాయమని అంటున్నారు. నమ్మకం అనే పునాదులపైనే జగన్ చుట్టూ నాయకులు చేరారు. ఇతర పార్టీల నుంచి వచ్చి.. మరీ చేరడం వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా ఇదే.
అయితే.. జగన్ ఇప్పుడు ఇదే విశ్వసనీయతను కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. తనను నమ్ముకున్న వారిని ఆయన పక్కన పెట్టేస్తున్నారని.. నాయకులు వాపోతున్నారు. ఇలా అయితే.. కష్టమనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ను బలపరిచేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాకపోతే.. ఎలా? కేవలం కొత్తవారినే గెలిపించుకోగలను అనే భావన కూడా సరైందేనా? అనే చర్చ రాజకీయంగా ఊపందుకోవడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ అడుగులు వైసీపీలో అభద్రతను పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.
This post was last modified on July 10, 2022 10:46 am
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…