ఇప్పుడు ఈ మాటే జనసేనలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్నికలకు కేవలం మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది. అయితే.. పొత్తుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు.. తర్జన భర్జనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని.. పవన్ భావిస్తున్నట్టు స్ఫష్టంగా తెలుస్తోంది. అయితే.. పొత్తుల విషయంలో ప్రస్తుతం ఆయన చెలిమి చేస్తున్న బీజేపీ కానీ.,. ఇటు.. టీడీపీ కానీ.. అనుకున్న విధంగా ముందుకు రావడం లేదు.
టీడీపీలో అయితే.. ఒంటరిగానే పోరుకు తలపడాలనే సంకేతాలు.. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు వస్తున్నాయి. పైగా పవన్ కూడా.. తనంతట తనుగా.. పొత్తులకు వెళ్లకుండా.. తమతో కలిసి వెళ్లాలని అనుకుంటున్న పార్టీలు వస్తే.. అప్పుడు చర్చిద్దామని.. ఆయన చెబుతున్నారు. ఇది కూడా పొత్తులకు ప్రతిబంధకంగా మారుతోంది. ఇక, బీజేపీ అయితే.. జనసేనతో సాగుతామని చెబుతున్నా.. ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలన్న డిమాండ్‌ను పక్కన పెట్టింది.
దీంతో బీజేపీ పవన్ కాకుండా.. ఆర్ ఎ స్ ఎస్ సిద్ధాంతాలు తెలిసిన వారికే సీఎం పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అంటే.. బీజేపీ విషయంలో జనసేన ఎలా ఉన్నా.. జనసేన విషయంలో బీజేపీ మాత్రం అభ్రతతోనే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తమకు కనుక ప్రజల్లో ఏమాత్రం బలం ఉందని తేలినా.. బీజేపీ నాయకులు ఒంటరిగానే పోరుకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ కసరత్తు కూడా చేసినట్టు చెప్పుకొస్తున్నారు. అంటే.. అవసరమైతే.. పవన్‌ను పక్కన పెట్టేందుకు.. బీజేపీ ఏమాత్రం వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో పవన్ ముందు. రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఒకటి.. పార్టీని గెలిపించుకునేందుకు తానే ఒంటరిగా బరిలో నిలవడం.. ప్రజల్లోకి వెళ్లడం, తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడం.. లేదా.. తమతో కలిసి వచ్చేందుకు రెడీగా ఉన్న టీడీపీని కలుపుకొని ముందుకు సాగడం. ఈ రెండు ఆప్షన్లు మినహా.. జనసేనాని ముందు మరో ఆప్షన్ కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ఆరు మాసాల ముందుగా కాకుండా.. ఇప్పటి నుంచి ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.
This post was last modified on July 7, 2022 4:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…