Political News

జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతి..

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌న్నెర్ర చేశారు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. న‌వ‌ర‌త్నాలు పేరుతో న‌వ ఘోరాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. మేం క‌న్నెర్ర చేస్తే.. వైసీపీ నాయ‌కులు ప‌రారేన‌ని అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అడుతున్నారని విమర్శించారు.

రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన సభలో చంద్ర‌బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ లక్షా 75 వేల కోట్ల అవినితీకి పాల్పడ్డారని.. చంద్రబాబు ఆరోపించారు. మదనపల్లెలో “ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో మినీ మహానాడు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

“మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే.. లేని సమస్యలు సృష్టించారు. ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైసీపీ నాయకులు బయటకు రాలేరు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరు. మేం తలచుకుంటే జగన్‌ పాదయాత్ర చేసే వారా? ఆ రోజు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకున్న పార్టీ టీడీపీ. మా హయాంలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు కట్టించాం. అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ. అమ్మఒడి బూటకం, ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం, నాడు- నేడు అవినీతి మయం” అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.

“వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపారు. మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షలో మద్యంలో రసాయనాలు ఉన్నాయని తేలింది. జగన్‌ .. సొంత డిస్టిలరీలు పెట్టుకుని రేట్లు పెంచారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలా? మూడేళ్లలో ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. కొత్తగా రూ.5వేల కోట్ల వృత్తి పన్ను వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు” అని చంద్రబాబు విరుచుకుప‌డ్డారు.

This post was last modified on July 7, 2022 8:45 am

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

16 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

53 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

3 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

5 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago