సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్స్ మరో స్థాయికి వెళ్లిపోయాయి. సమయం సందర్భం లేకుండా ఒక హీరో మీద ఇంకో హీరో అభిమానులు దండెత్తడం.. కించపరిచే పోస్టులు పెట్టడం సాధారణంగా మారిపోయింది.
ఆయా భాషల్లో హీరోల అభిమానుల మధ్య గొడవలు సరిపోవని.. ఒక భాషకు చెందిన హీరో అభిమానులు.. ఇంకో భాషకు చెందిన హీరో ఫ్యాన్స్‌తో గొడవ పడే ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎవరిని ఎందుక కవ్విస్తారో తెలియదు కానీ.. అప్పుడప్పుడూ ఇలాంటి గొడవలు ట్విట్టర్‌ను వేడెక్కించేస్తుంటాయి.
తాజాగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు అభిమానులు.. తమిళ టాప్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ఒక రేంజిలో నడుస్తోంది. మామూలుగా అయితే నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి గొడవలు పడుతుంటారు కానీ.. ఇప్పుడు అదేమీ లేకుండానే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ అవతలి హీరో మీద కించపరిచే పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు.
ప్రతి హీరో కెరీర్లోనూ గర్వంగా చెప్పుకునే పాత్రలు, సినిమాలు ఉంటాయి. అలాగే చెత్త సినిమాలు, పేలవమైన పాత్రలు ఉంటాయి. ఇప్పుడు మహేష్, విజయ్ అభిమానులు ఈ రెండింటినీ ఉపయోగించుకుంటున్నారు. విజయ్‌ని మించిన యాక్టర్, డ్యాన్సర్ లేడంటూ అతడి ఫ్యాన్స్ ఎలివేషన్లు ఇస్తూ.. మహేష్ బాబును కించపరిచే పోస్టులు పెడుతున్నారు. దానికి కౌంటర్‌గా మహేష్ అభిమానులు తమ హీరోకు ఎలివేషన్లు ఇస్తూ.. విజయ్ గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ గొప్ప డ్యాన్సర్ అంటూ అతడి డ్యాన్స్ బిట్లను అతడి ఫ్యాన్స్ షేర్ చేస్తుంటే.. అతను వేసిన కొన్ని పిచ్చి డ్యాన్సుల తాలూకు వీడియోలను మహేష్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
అదే సమయంలో విజయ్ అభిమానులేమో ‘బ్రహ్మోత్సవం’ లాంటి చిత్రాల్లోని మహేష్ కామెడీ డ్యాన్సుల వీడియోలు పెడుతున్నారు. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాల్లో మహేష్ అదరగొడితే.. వాటిని రీమేక్ చేసి చెడగొట్టాడని, అయినా సరే మహేష్ పుణ్యాన హిట్లు కొట్టాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ విజయ్‌ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువురి చిత్రాల్లోని కొన్ని సిల్లీ సీన్ల తాలూకు వీడియోలు పరస్పరం పోస్ట్ చేస్తూ ఈ గొడవను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైందన్నదే అర్థం కావడం లేదు.
This post was last modified on July 7, 2022 8:47 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…