Political News

వైసీపీ ఎమ్మెల్యే.. డ్రైనేజీలో కూర్చుని నిర‌స‌న‌

సాధార‌ణంగా.. విపక్షంలో ఉన్న నాయ‌కులు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు జ‌ర‌గ‌డం లేదంటూ.. నిర‌స‌న వ్య‌క్తం చేస్తారు. లేదా.. త‌మ‌కు ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేదంటూ.. ఆందోళ‌న వ్యక్తం చేస్తారు. ఇది .. కామ‌న్ కూడా! ఏ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నా.. స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. కానీ.. అదేం చిత్ర‌మో కానీ.. వైసీపీ స‌ర్కారులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డున ప‌డుతున్నారు. త‌మ‌కు రూపాయి కూడా ఇవ్వ‌డం లేద‌ని.. క‌నీసం.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు కూడా చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వ‌రుస‌లో.. తాజాగా నెల్లూరు రూర‌ల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే.. సీనియ‌ర్ నాయ‌కుడు.. కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి.. స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌మ‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ప్ర‌జ‌లు త‌మ‌ను నిలదీస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేక పోతున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో స్థానిక ఉమారెడ్డి గుంటలో శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు.

డ్రైనేజీపై వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ క్రమంలో మరోసారి కాలువలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోగా పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాలువ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే డ్రైనేజీలోనే పడుకుంటానని హెచ్చ‌రించారు. దీంతో అధికారులు ఈ నెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.

This post was last modified on July 5, 2022 4:30 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

29 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago